బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

ఆదివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 రెండో విడత ‘పంచాయతీ పోరు’కు సిద్ధం నిమ్మకాయల ధరలు పశ్చిమ డెల్టాకు నీటి విడుదల పులిచింతల సమాచారం వైద్య కళాశాల అభివృద్ధికి విరాళం గుంటూరు మెడికల్‌: ఎనిమిది దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన గుంటూరు వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. కళాశాల 1964 బ్యాచ్‌ పూర్వ విద్యార్థి, ప్రముఖ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ తాతినేని గోపాలకృష్ణ.. అనాటమీ విభాగం అభివృద్ధికి రూ.25 లక్షల భారీ విరాళం అందించేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.10 లక్షలకు సంబంధించిన చెక్కు అందజేశారు. తాను విద్యనభ్యసించిన కళాశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలనే సంకల్పంతో డాక్టర్‌ గోపాలకృష్ణ ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులతో అనాటమీ విభాగంలో బోధన సదుపాయాలు, విద్యా మౌలిక వసతులను మరింత మెరుగు పరచనున్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌, అదనపు వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.శ్రీధర్‌, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌, అనాటమీ విభాగాధిపతి ప్రొ. డాక్టర్‌ డి.మాధవి ఈ విరాళంపై హర్షం వ్యక్తం చేశారు.

న్యూస్‌రీల్‌

పకడ్బందీగా కౌంటింగ్‌

నేడు సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్‌ నిబంధనలు పాటించి పారదర్శకంగా నిర్వహించాలి అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశం

ఆదివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
రెండో విడత ‘పంచాయతీ పోరు’కు సిద్ధం

7

తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.2,800, గరిష్ఠ ధర రూ.4,600, మోడల్‌ ధర రూ.3,800 వరకు పలికింది.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు 2,010 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు శనివారం తెలిపారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 25.1087 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

బాపట్ల: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవంబర్‌ 29వ తేదీన జిల్లాలో రెండో విడత కింద అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు, కొల్లూరు, వేమూరు, చీరాల, వేటపాలెం మండలాల్లోని మొత్తం 113 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. 17 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 96 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 1,204 వార్డులకుగాను 392 ఏకగ్రీవం కాగా, మిగిలిన 812 చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కావడంతో సర్పంచ్‌ స్థానానికి మాత్రమే పోలింగ్‌ జరిగే అవకాశం ఉందని, ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి

రెండో విడత ఎన్నికల కోసం 1,038 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఏకగ్రీవమైన వార్డులను పరిగణనలోకి తీసుకుని పోలింగ్‌ కేంద్రాల విలీన ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. వీటిలో 130 ప్రాంతాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వేటపాలెం, చీరాల మండలాల్లో ఇటువంటి ప్రాంతాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. 130 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 1,450 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 2,326 మంది ఇతర పోలింగ్‌ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నగేష్‌ కుమారి పాల్గొన్నారు.

అధికారులకు దిశానిర్దేశం

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల యంత్రాంగానికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అధైర్యపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల విధులకు గైర్హాజరు కావద్దని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని అన్నారు.

నిర్లిప్తంగా ఉంటే చర్యలు తప్పవు

జిల్లా అధికారులందరూ వాకీటాకీలను ఉపయోగించాలని సూచించారు. విధులకు గైర్హాజరైన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎన్నికల సరళిపై కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు వివరాలు పంపాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ఒక పురుష వలంటీర్‌, ఒక మహిళా వలంటీర్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలు లేదా ఆయాలు పోలింగ్‌ కేంద్రాలకు అందుబాటులో ఉండాలన్నారు. పాఠశాలల్లో నాలుగో తరగతి ఉద్యోగులను వలంటీర్లుగా ఏర్పాటు చేయాలని సూచించారు.

పింఛను పంపిణీకి చర్యలు

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ నగదు పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఎన్నికల కమిషన్‌ అనుమతుల మేరకు డిసెంబర్‌ 1వ తేదీన పింఛన్‌ పంపిణీ చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటే మరుసటి రోజు లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయాలని తెలిపారు. ఇందుకోసం నవంబర్‌ 30వ తేదీన అన్ని ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో లవన్న, డీపీఓ నగేష్‌ కుమారి, బాపట్ల ఆర్‌డీవో హరికుమార్‌, డీఈవో శ్రీనివాస్‌ సింగ్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు షేక్‌ షఫీ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు కచ్చితంగా ప్రారంభించాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అదనపు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని, కేంద్రాల వెలుపల కూడా విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి డిస్పాచ్‌ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. రేపల్లె నియోజకవర్గంలోని ఆయా మండలాలకు ఎలా చేరుకోవాలనే అంశాలను సంబంధిత ఉద్యోగులకు వివరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సూక్ష్మ పరిశీలకులకు ఇన్‌చార్జి అధికారులను అనుసంధానించాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులందరికీ ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి, ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలు, సూచనలను ఎప్పటికప్పుడు అందులో పంపించాలని తెలిపారు.

అమృతలూరు (వేమూరు): అమృతలూరు మండలంలోని మూల్పూరు గ్రామం మండల ప్రాథమిక పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో చేసిన పోలింగ్‌ కేంద్రాలను శనివారం జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పరిశీలించారు. వేమూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్‌డీవో, శ్రీదేవి, తహసీల్దార్‌ నెహ్రూబాబు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement