సాగర్‌ ఏపీఆర్‌జేసీకి రాష్ట్రస్థాయి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ ఏపీఆర్‌జేసీకి రాష్ట్రస్థాయి పురస్కారం

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

సాగర్‌ ఏపీఆర్‌జేసీకి రాష్ట్రస్థాయి పురస్కారం బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఒలింపిక్స్‌ లక్ష్యంగా యువత ముందుకు సాగాలి

మాచర్ల: ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ, ఫారెస్ట్‌ బై హార్ట్‌ఫుల్‌నెస్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ – సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ 2026’ అవార్డు నాగార్జున సాగర్‌ ఏపీఆర్‌జేసీకి దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ఉత్తమ సంస్థల్లో ఒకటిగా పల్నాడు జిల్లా నుంచి ఈ కళాశాల నిలిచింది. నెట్‌ జీరో క్లీన్‌ అప్‌ డ్రైవ్స్‌, ప్రాంగణ పరిశుభ్రత, పచ్చదనం నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించింది. పల్నాడు జిల్లా డీసీఓ బి.నందన చేతుల మీదుగా కళాశాలకు పురస్కారాన్ని అందజేశారు. నెట్‌ జీరో కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.ఎం.బాషా, ఎకో క్లబ్‌, గ్రీన్‌ కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థుల సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. హేమాంబర రెడ్డి పేర్కొన్నారు.

డీఎస్‌డీవో ఎంవీ ప్రసాద్‌

చిలకలూరిపేట: అధిక ధరలకు బియ్యం విక్రయాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ హెచ్చరించారు. బియ్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు శనివారం పట్టణంలోని బియ్యం రిటైల్‌, హోల్‌సేల్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ జై శ్రీరామ్‌ క్వాలిటీ బియ్యం రూ. 82కు, మిగిలిన రకాల బియ్యం అంతకంటే తక్కువ ధరకు విక్రయించాలని చెప్పారు. తనిఖీల్లో భాగంగా స్టాక్‌ రిజిస్టర్‌ లేదని గుర్తించిన దుకాణదారుడికి నోటీసు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిక పంపిస్తానని తెలిపారు. శ్రీనివాస ట్రేడర్స్‌ దుకాణంలో సూర్య బ్రాండ్‌ బస్తాలు రూ.2,100 విక్రయించారన్న ఫిర్యాదుపై కూడా తగిన చర్యల కోసం జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్‌, సంయుక్త కార్యదర్శి బేబీ విక్రమ్‌ పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, శారీరక దారుఢ్యాన్ని ప్రోత్సహించడం, నషా ముక్త్‌ యువతే ధ్యేయంగా ‘సండేస్‌ ఆన్‌ సైకిల్‌’ 100వ ఎడిషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మేరా యువ భారత్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంచాలకుడు కె.వెంకట్‌ ఉజ్వల్‌ తెలిపారు. శనివారం స్థానిక స్తంభాలగరువులోని చేబ్రోలు మహాలక్ష్మమ్మ పుల్లయ్య మున్సిపల్‌ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఉజ్వల్‌ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం లక్ష్యంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్‌ (మై భారత్‌) కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భారతదేశ ఒలింపిక్‌ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మేరా యువ భారత్‌ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు డి.కిరణ్మయి మాట్లాడుతూ ఫిట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా నిర్వహిస్తున్న ‘సండేస్‌ ఆన్‌ సైకిల్‌’ కార్యక్రమం యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. నషా ముక్త్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గుంటూరు ఈగల్‌ సెల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సునీల్‌ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌.బాలగంగాధర్‌ తిలక్‌, పీఈటీ వై.ప్రభాకర్‌, ఎన్‌సీసీ ప్రతినిధి పి.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement