ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

రెండో దశ పంచాయతీ ఎన్నికలకు 400 మంది పోలీసులతో బందోబస్తు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి ఎస్పీ ఉమామహేశ్వర్‌

చీరాల: పంచాయతీ రెండో దశ ఎన్నికల నిర్వహణకు సుమారు 400 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ అన్నారు. శనివారం కొత్తపేటలోని రావి జయలక్ష్మి, సుబ్బారాయుడు కల్యాణ మండపంలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, సమర్ధ్‌ మొబైల్‌ యాప్‌ వినియోగం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఎన్నికల సమయంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన మున్సిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మొదటి దశ పంచాయతీ ఎన్నికలను పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఇదే స్ఫూర్తితో ఆదివారం జరగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలను కూడా అవాంఛనీయ సంఘటనలు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లును క్షుణ్ణంగా తనిఖీ చేసి అనంతరం లోపలికి పంపించాలన్నారు. రెండో దశలో చీరాల, వేమూరు నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో 113 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని, 400 మందికి పైగా పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అదనంగా ఎనిమిది స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్సు, 14 స్రైకింగ్‌ ఫోర్స్‌, 20 రూట్‌ మొబైల్స్‌ను అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చీరాల, బాపట్ల డీఎస్పీలు ఎండీ మోయిన్‌, సీహెచ్‌ చంద్రమౌళి, ఎస్బీ సీఐ నారాయణ, ఎలక్షన్‌ సెల్‌ సీఐ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement