ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు బోధనేతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. శనివారం కలెక్టరేట్‌ వద్ద ఉన్న పాఠశాల విద్య ఆర్జేడీ కార్యాలయంలో జోనల్‌ స్థాయి సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. విద్యాశాఖాధికారులతో పాటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సదరన్‌ ప్రైవేటు లెక్చరర్స్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌పీఎల్‌టీవో) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పయర్ద నాగయ్య, కార్యదర్శి ఎం.రాకేష్‌ ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై సమావేశపు కన్వీనర్‌, మార్కాపురం డీఈఓ ఎస్‌.సుబ్బారావు, పల్నాడు డీఈఓ పీవీజే రామారావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల్లో వేలాది మంది ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యారంగానికి సేవలందిస్తున్నప్పటికీ, వారికి తగిన ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగ భద్రత, ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు, సంక్షేమ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల అభివృద్ధికి యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయుల కృషి కూడా ఎంతో కీలకమని, ఉపాధ్యాయుల సంక్షేమం ద్వారానే నాణ్యమైన విద్య సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, వారి అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర సంక్షేమ విధానాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పాల్గొన్న ప్రైవేటు టీచర్స్‌, లెక్చరర్స్‌, ప్రొఫెసర్స్‌ యూనియన్‌(పీటీఎల్‌పీయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.బాబ్జీ, ప్రధాన కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముసాయిదా కమిటీకి అందజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో పీటీఎల్‌పీయూ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి టి.శివయ్య, సభ్యులు పాల్గొన్నారు.

జోనల్‌ స్థాయి సంప్రదింపుల సమావేశంలో సంఘాల విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement