లెక్కింపు కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

లెక్కింపు కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

● కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ● ఏర్పాటు పరిశీలన

బాపట్ల: బాపట్ల మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30న బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు స్థానిక బాపట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపడుతున్న ఏర్పాట్లను శనివారం రాత్రి జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో చేపడుతున్న ఏర్పాట్లు, కౌంటింగ్‌ హాళ్లలో మౌలిక సదుపాయాలు, అభ్యర్థులు, ఏజెంట్లకు కల్పించాల్సిన వసతులు, తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతించాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ వెంట ఆర్డీఓ ఏ.హరికుమార్‌, డీఆర్డీఏ పీడీ, రిటర్నింగ్‌ అధికారి బి.సింగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.హాసిని, డీఈ కృష్ణారెడ్డి, ఆర్‌ అండ్‌ బీ డీఈ అరుణ, తహసీల్దార్‌ షేక్‌ సలీమ, మండల సర్వేయర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement