అంతర్‌ కళాశాలల కబడ్డీ పోటీల విజేత కృష్ణవేణి కళాశాల | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ కళాశాలల కబడ్డీ పోటీల విజేత కృష్ణవేణి కళాశాల

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

నరసరావుపేటఈస్ట్‌: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ విజేతగా కృష్ణవేణి డిగ్రీ కళాశాల(నరసరావుపేట) జట్టు నిలిచింది. రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్‌లో కృష్ణవేణి జట్టు బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల జట్టుపై విజయం సాధించి కప్పు కై వసం చేసుకోగా, బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశా ల జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. జేకెసీ కళాశాల (గుంటూరు) జట్టు తృతీయ, బాపట్ల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల జట్టు నాల్గవ స్థానంలో నిలిచాయి. వర్సిటీ పరిధి లోని కళాశాలల నుంచి 22 జట్లు పాల్గొనగా నాకౌట్‌ కం లీగ్‌ పద్ధతిలో పోటీలు నిర్వహించా రు. కళాశాల మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్‌ చైర్మన్‌, కళాశాల ప్రిన్సిపల్‌ కపలవాయి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ కాట్ల రామకోటేశ్వరరావు, కార్యదర్శి రాయల శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఓగూరి నాగేశ్వరరావు, పాశం కృష్ణారావు, మద్దుల కోటేశ్వరరావు, టోర్నమెంట్‌ పరిశీలకులు డాక్టర్‌ సూర్యనారాయణ, సెలక్షన్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ టి.శివప్రసాదు, డాక్టర్‌ బుచ్చిబాబు, ప్రేమ్‌కుమా ర్‌, వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పాతూరి శ్రీనివాస్‌, వివిధ కళాశాలల పీడీలు డాక్టర్‌ గౌరీశంకర్‌, డాక్టర్‌ జిజేవిడి ప్రసాద్‌, డాక్టర్‌ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement