వృద్ధురాలి హత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్య

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

నగలు, నగదు అపహరణ

గుంటూరు రూరల్‌: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి హతమార్చి ఒంటిపై ఉన్న నగలు, నగదు అపహరించిన సంఘటన శనివారం గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నల్లపాడు సీఐ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెం గ్రామానికి చెందిన బత్తుల వెంకటమ్మ(85)కు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త కాలం చేయడంతో తురకపాలెం బీసీ కాలనీలో చిన్నకుమారుడు వెంకటరావు ఇంటి పక్కనే చిన్న ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో వెంకటరావు భార్య శనివారం మధ్యాహ్నం వెంకటమ్మకు భోజనం పెట్టేందుకు వెళ్లగా ఇంట్లో రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే భర్తకు తెలియజేయగా ఆయన వెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది. వెంటనే నల్లపాడు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. క్లూస్‌ టీం పరిసరాల్లోని ఆధారాలు సేకరించగా, డాగ్‌ స్క్వాడ్‌ మృతదేహం నుంచి సమీపంలో 200 మీటర్ల వరకూ వెళ్లి ఆగిపోయింది. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారం, సుమారు రూ 15వేల వరకు నగదు, వెండి పట్టీలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement