సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2026 పురపోరులో అతివల హవా
చీరాల: చీరాల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని ప్రభుత్వం ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసింది. మున్సిపాలిటీ చరిత్రలోనే తొలిసారిగా ఇలా కేటాయించారు. అందుకు తగ్గట్టుగా పురపోరులో అభ్యర్థులను నిలిపేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ ఇస్తర్ల షెర్లీ... చీరాలకు చెందిన డాక్టర్ ఇస్తర్ల బాబూరావు కుమార్తె. ఆయన మొదటి నుంచి వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ డాక్టర్ల విభాగం చీరాల కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. డాక్టర్‌గా ఆయన చీరాల ప్రజలకు సుపరిచితులు. అలాగే ఎస్సీ సామాజికవర్గంలోనూ పేరున్న వ్యక్తి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ ఇస్తర్ల షెర్లీకి ఇది అనుకూలంగా మారుతుందని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. చీరాల ప్రాంతంలో 2019 –24 వరకు వైఎస్సార్ సీపీ హయాంలో పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ఆ పార్టీ ముందుకెళ్తోంది. మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ శ్రేణులు చెబుతున్నాయి. రోడ్లు, డ్రైన్లు, పార్కులు, పట్టణాభివృద్ధి వంటి పనులే తమకు విజయాన్ని చేకూరుస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ నుంచి బీటెక్ పట్టభద్రురాలు యెరిచర్ల హనీ స్పందన పోటీ చేస్తున్నారు. చీరాల టీడీపీలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చీరాలకు చెందిన డాక్టర్ మేడిద దివ్య బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మద్దతు ఇస్తున్నారు. మూడు పార్టీలు విద్యావంతులైన మహిళలను రంగంలోకి దించాయి.
కూటమిలో సీట్ల గొడవ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య వార్డుల కేటాయింపుపై గొడవలు జరిగాయి. జనసేన, బీజేపీలకు నామమాత్రంగా సీట్లు కేటాయించడంపై ఆయా పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు బీజేపీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎవరూ లేరని, తమకు అవకాశం కల్పించాలని పలువురు ఆశావహులు పోటీపడ్డారు. నోటిఫికేషన్‌కు ముందు ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరిన వారికి సీట్లు కేటాయించడంతో టికెట్లు ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. బీజేపీకి మాత్రం రెండు వార్డులే కేటాయించారు. టీడీపీ విజయానికి కీలకంగా పనిచేసిన జనసేన కూడా సీట్ల కేటాయింపుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. వార్డుల సంఖ్య పెరగడంతో తమకు కూడా కొంత అవకాశం దక్కుతుందని ఆశించింది. ఆరు వార్డులు కేటాయించాలని కోరినా, నాలుగు వార్డులే కేటాయించారు. 16వ వార్డులో టీడీపీ, జనసేనలు పోటీలో నిలిచాయి. జనసేన తరఫున అనుమకొండ కిషోర్ బీ–ఫాం తీసుకోగా, టీడీపీ నుంచి తుపాకుల దుర్గా రత్నప్రసాద్ బీ–ఫాం తీసుకున్నారు. రెండు పార్టీలూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. గతంలో టీడీపీకి మద్దతు పలికిన కొందరు కౌన్సిలర్లు ప్రస్తుతం సీట్లు ఆశించినప్పటికీ, అవకాశం దక్కకపోవడంతో ఇతర పార్టీల్లోకి వెళ్లారు. గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వైకుంఠపురానికి చెందిన ఓ మహిళా మాజీ కౌన్సిలర్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.
న్యూస్‌రీల్
మహిళా ఓటర్లే కీలకం
చీరాల మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనలో భాగంగా గతంలో 33 వార్డులు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్యను 44కు పెంచారు. అలాగే పోలింగ్ కేంద్రాల సంఖ్యను 67 నుంచి 88కి పెంచారు. మొత్తం ఓటర్లు 69,557 మంది ఉండగా, వీరిలో పురుషులు 33,504 మంది, మహిళలు 36,043 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు. సామాజికవర్గాల వారీగా ఎస్సీ ఓటర్లు 15,604 మంది, ఎస్టీ ఓటర్లు 3,838 మంది, బీసీ ఓటర్లు 27,948 మంది, ఓసీ ఓటర్లు 22,167 మంది ఉన్నారు. అన్ని వర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ పదవి అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండగా, ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో రెండు పర్యాయాల తర్వాత మళ్లీ చైర్‌పర్సన్ పీఠం మహిళలకు దక్కనుంది.
జోరుగా వైఎస్సార్ సీపీ ప్రచారం
గెలుపే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ పురపోరులో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. గత కౌన్సిల్ హయాంలో చేసిన అభివృద్ధినే ప్రధాన అజెండాగా చేసుకుని పార్టీ ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌బాబు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. రోజూ వార్డుల్లో అభ్యర్థులతో కలిసి ఆయన కూడా ప్రచారం నిర్వహిస్తూ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. గత కౌన్సిల్‌లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధించిందని, ఈ సారి కూడా చైర్‌పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులే తమ విజయానికి కారణమవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
● కీలకం కానున్న మహిళా ఓటర్లు
● చీరాల చైర్‌పర్సన్ పదవి
ఎస్సీ మహిళకు రిజర్వేషన్
● గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న
వైఎస్సార్ సీపీ
● కూటమిలో బీజేపీ, జనసేనకు
నామమాత్రంగా వార్డుల కేటాయింపు
‘పుర’ పోరులో రాజకీయ పార్టీలు దూకుడు పెంచేశాయి. చీరాలలో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మున్సిపల్ చైర్‌పర్సన్ బరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ తలపడుతుండగా.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్ తరఫున అభ్యర్థిని నిలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచి వైఎస్సార్ సీపీ ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల తీర్పులో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు.