జోరుగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచారం | - | Sakshi
Sakshi News home page

జోరుగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ప్రచారం

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

నెహ్రూనగర్‌: గుంటూరు నగరంలో వైఎస్సార్‌ సీసీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఆదివారం జోరుగా సాగింది. నగరంలోని పలు డివిజన్లలో నాయకులు ప్రచారం నిర్వహించారు. పలుచోట్ల ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించి, ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పాత గుంటూరు యాదవుల బజార్‌ పరిధిలోని 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి ఏలికా సుభాషిణి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, గుంటూరు మేయర్‌ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా హాజరయ్యారు. స్థానికులను వారు నేరుగా కలిసి, సుభాషిణిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. 20వ డివిజన్‌ (రెడ్ల బజార్‌) కార్పొరేటర్‌ అభ్యర్థి మురళి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు. మురళిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.

అరుంధతి నగర్‌లో కార్యాలయం ప్రారంభం

75వ డివిజన్‌ (అరుంధతి నగర్‌) కార్పొరేటర్‌ అభ్యర్థి దమ్మాలపాటి దీప్తి ప్రియాంక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ నూతన కార్యాలయాన్ని నాయకులు ప్రారంభించారు. అంబటి రాంబాబు, తాడికొండ శ్రీదేవి, షేక్‌ నూరి ఫాతిమా సంయుక్తంగా రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయాన్ని ప్రారంభించి, అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు.

7వ డివిజన్‌ (పోత్తూరుపేట్‌) కార్పొరేటర్‌ అభ్యర్థి ఫారూఖ్‌ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా స్థానికంగా ఇంటింటి ప్రచారం చేపట్టి, ఫారూఖ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డివిజన్లలో ఇంటింటికి తిరిగిన

ముఖ్య నాయకులు

ప్రజా మద్దతు తమ పార్టీకేనని

అంబటి, నూరి ఫాతిమా, మేయర్‌

అభ్యర్థి తాడికొండ శ్రీదేవి ధీమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement