భార్య అన్నం వండలేదని వృద్ధుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భార్య అన్నం వండలేదని వృద్ధుడి ఆత్మహత్య

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

భార్య అన్నం వండలేదని వృద్ధుడి ఆత్మహత్య పర్చూరు(చినగంజాం): భార్య అన్నం వండలేదని మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పర్చూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పర్చూరు ఎస్సై పులి గోపి వివరాల ప్రకారం.. పర్చూరు మహంకాలమ్మ గుడిలో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామానికి చెందిన తమ్మలూరి వందనం (77) అనే వృద్ధుడు భార్య అన్నం వండలేదనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 28వ తేదీ ఉదయం డ్యూటీ ముగించి ఇంటికి రాగానే భార్యతో అన్నం వండలేదని గొడవపడ్డాడు. మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయి యద్దనపూడి రోడ్డులోని పొలంలో ఎలుకల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చీరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం స్థానిక ప్రసాద్‌ థియేటర్‌ సమీపంలో చోటుచేసుకుంది. వేటపాలెం నుంచి చీరాలకు వస్తున్న ఆటో.. ప్రసాద్‌ థియేటర్‌ సమీపంలోకి రాగా.. అదే సమయంలో రోడ్డుపైకి వస్తున్న జేసీబీ ముందు భాగం ఆటోకు బలంగా తగిలింది. ఆటోలో ప్రయాణిస్తున్న వేటపాలేనికి చెందిన షేక్‌ షమీమ్‌ (56)కు, ఆటోడ్రైవర్‌ సురేష్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా తీవ్రగాయాలైన షేక్‌ షమీమ్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోడ్రైవర్‌కు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఒన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement