పర్యాటక హబ్‌గా బాపట్ల
బాపట్ల: రానున్న ఐదేళ్లలో బాపట్ల పర్యాటక హబ్‌గా మారనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. జిల్లాలో అభివృద్ధి చేస్తున్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు సింగపూర్ అధికారుల బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. కలెక్టరేట్‌కు వచ్చిన సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందానికి జిల్లాలోని అధికారులు పూల మొక్కలతో ఘనంగా ఆహ్వానం పలికారు. బాపట్ల జిల్లా భౌగోళిక స్వరూపం, వ్యవసాయ, ఆక్వా సాగుపై ఆధారపడిన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, పర్యాటక రంగం అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను జిల్లా కలెక్టర్ వివరించారు. బీచ్ ల అభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న కృషిని బృందం ప్రత్యేకంగా అభినందించింది. సమావేశంలో సింగపూర్ ఎకానమిక్ కన్సల్టెంట్ ప్రైస్ సీఈవో చూతోక హిమ్, సింగపూర్ కోపరేషన్ ఎంటర్‌ప్రైజ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ త్యాలైన్ చీవో, సింగపూర్ సస్టైనబిలిటీ స్టాటజిక్ ప్రాజెక్ట్ సీనియర్ మేనేజర్ నిషశర్ధ, రాష్ట్ర ఆర్థిక ఘనంగా శాఖ డైరెక్టర్ బి గోపాల్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విల్లేజ్ క్లినిక్‌లకు స్థలాలు కేటాయించాలి
జిల్లాలో ప్రతి సచివాలయ పరిధిలో ఏర్పాటు చేయనున్న విల్లేజ్ క్లినిక్‌లకు ప్రతిపాదించిన స్థలాలను వెంటనే వైద్య–ఆరోగ్యశాఖకు అప్పగించి నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో తహసీల్దార్లు, ఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 30 ప్రాంతాల్లో ఇప్పటివరకు స్థలాలు ఖరారు కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న కొందరు తహసీల్దార్లపై అసహనం వ్యక్తం చేశారు. స్థలాలు కేటాయించని చోట్ల వెంటనే స్థలాలను గుర్తించి, వైద్య–ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ భావన, డీఆర్‌ఓ గంగాధర్ గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థినులకు కళ్లద్దాలు పంపిణీ
జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న 2,974 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థినులకు కలెక్టర్ కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి విజయమ్మ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రత్నమోహన్‌తోపాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పర్యాటక హబ్‌గా బాపట్ల


