కోట్లాట
బరులలో వ్యాపారం
న్యూస్‌రీల్
తీరంలో జోరుగా కోడి పందేలు దగ్గర ఉండి పర్యవేక్షించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026
రేపల్లె: సంక్రాంతి సాంప్రదాయం పేరుతో పచ్చనేతలు కోట్లు కొల్లగొట్టారు. పండుగ మూడు రోజుల పాటు యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట జూదాలు నిర్వహించి జేబులు నింపుకున్నారు. సంక్రాంతి, కనుమ పండుగ రోజులలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బరులలో దగ్గరుండి పోటీలను పర్యవేక్షించటంపై ప్రజలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కోడిపందెం, పేకాట, గుండాట, నంబర్లాట వంటి జూదాలతో రూ. కోట్ల చేతులు మారినా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది. బరులలోనే మద్యం దుకాణాలను తెరచి ఇష్టానుసారంగా విక్రయాలు జరిపి పచ్చనేతలు సొమ్ము చేసుకున్నారు.
రూ.లక్షల్లో సాగిన పందేలు
చినగంజాం: కోడి పందేల నిర్వహణ వద్దంటూ కోర్టులు ఎంత మొత్తుకున్నా అధికార పార్టీ అండదండలతో చినగంజాం మండలంలో పచ్చనేతల కోడి పందేల బరి ఎటువంటి అడ్డంకులు లేకుండా యథేచ్ఛగా వరుసగా నాలుగు రోజులుపాటు కొనసాగింది. సంక్రాంతి పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే పందేలు ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. మండలంలోని పెదగంజాం పంచాయతీ పల్లెపాలెం గ్రామంలో గ్రామ సచివాలయానికి కొద్ది దూరంలో ఉత్తర వైపు ప్రాంతమంతా కోడి పందేల బరికి వేదికై ంది. ఆ ప్రాంతమంతా భారీగా టెంట్‌లు వేసి తమ పనులు కొనసాగించారు. స్థానిక ప్రజాప్రతినిధి స్వయంగా రంగంలోకి దిగి పందేలను నిర్వహించినట్లు పక్కా సమాచారం. రోజుకు 100 జతలకు పైగా కోడి పుంజులు బరిలో పోటీలు పడ్డాయి.
బరి వెలుపల దుకాణాలతో ఆదాయం
కోడి పందేల బరి చుట్టూ ఏర్పాటు చేసే దుకాణాలతో రూ.లక్షల్లో ఆదాయం చేకూరుతున్నట్లు సమాచారం. తినుబండారాలు మొదలుకొని మద్యం వరకు జూద క్రీడలు, గుండాట, పేకాట మొదలుకొని ఇతర జేబులు ఖాళీ చేసే పలు క్రీడలను ఏర్పాటు చేశారు. దుకాణదారుల నుంచి నిర్వహణ కోసం వేలల్లో నగదు వసూలు చేసినట్లు సమాచారం. మద్యం అయితే భారీగా అమ్మకాలు జరుగగా ప్రభుత్వ ధరలకు మించి రూ.50 నుంచి రూ.70 వరకు అమ్మకాలు చేసినట్లు సమాచారం. పార్కింగ్‌కు సంబంధించి ఫీజులు వసూలు చేపట్టగా వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు, పదుల సంఖ్యంలో కార్లు ప్రాంతంలో ప్రత్యేక పార్కింగ్ కొనసాగింది. ఇక సుదూర ప్రాంతాల నుంచి పందెంగాళ్లు వేల సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పల్లెపాలెం గ్రామం చుట్టు పక్కల ప్రాంతమంతా నాలుగు రోజులుగా స్థానికేతరులతో నిండి పోయింది.
పూర్వం సరదా కోసం సాగిన కోడి పందేలు నేడు లక్షలు, కోట్ల వ్యాపారంగా మారాయి. పందేల పిచ్చిలో వందలాది మంది జేబులు ఖాళీ చేసుకున్నారు. పెదగంజాంలో నిర్వహిస్తున్న కోడి పందేల్లో పుంజును బరిలో దించాలంటే నిర్వాహకులకు రూ.1000 కోడి యజమాని చెల్లించాల్సి ఉంది. ఇరువురు రూ.2 వేలు చెల్లిస్తేగాని పందేంలోకి దిగే పరిస్థితి. దాంతో పాటు కోడికి కత్తి కట్టేవాడికి నగదు చెల్లించుకోవాల్సి ఉండగా, బరిలోకి దిగేందుకు ముగ్గురు మనుషులు అనుమతి కాగా రెండు వైపుల మొత్తం 6 గురికి అనుమతి ఉండగా వారికి ఒక్కొక్కరికి రూ.500 చెల్లించాల్సి వస్తుంది. అంతేగాకుండా బరిలోపలికి వెళ్లి కుర్చీ వేసుకొని కూర్చొనేందుకు, పందేలు కాసే వారికి ఒక్కొక్కరికి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఇక బరిలో దిగిన కోళ్లకు వీక్షకులు పై పందేలు సుమారు రూ.50 వేలు నుంచి రూ.లక్షల్లో కొనసాగుతుంది. ప్రతి రోజు ఇదే విధంగా 100 జతలకు మించి కోళ్లను పందేనికి తీసుకొచ్చి పందెంరాయుళ్లు తలపడుతున్నారు. పందేలను అడ్డుకోకుండా ఉండేందుకు ముందుగానే ముట్టజెప్పినట్లు సమాచారం.
కోట్లాట
కోట్లాట
కోట్లాట
కోట్లాట
కోట్లాట
కోట్లాట
కోట్లాట
కోట్లాట


