సత్తా చాటిన నంద్యాల, మార్కాపురం జిల్లాల ఎడ్లు | - | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన నంద్యాల, మార్కాపురం జిల్లాల ఎడ్లు

Jan 17 2026 8:23 AM | Updated on Jan 17 2026 8:23 AM

సత్తా చాటిన నంద్యాల, మార్కాపురం జిల్లాల ఎడ్లు

సత్తా చాటిన నంద్యాల, మార్కాపురం జిల్లాల ఎడ్లు

● తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా పూజానగర్‌ గ్రామానికి చెందిన సురికి సురేంద్రరెడ్డి, పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు చెందిన ఎడ్లు 2714 దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరు రూ.80 వేలు, వైఎస్సార్‌ కడప జిల్లా చౌటపల్లి గ్రామ సర్పంచ్‌ మార్తాల ఓబులరెడ్డికి చెందిన ఒక జత ఎడ్లు 2,606.10 దూరంలాగి తృతీయ స్థానం, రెండో జత ఎడ్లు 2,569.6 దూరం లాగి చతుర్ధ స్థానంలో నిలిచాయి. ఈ ఎడ్ల జతల యజమానికి రూ.60 వేలు, రూ.50 వేల ప్రకారం అందజేశారు. ● కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కాసానేని రాజా చౌదరి, వల్లభనేని మోహన్‌రావు ఎడ్లు 2,545.3 దూరంలాగి 3వ స్థానంలో నిలిచి రూ.40 వేలు, వైఎస్సార్‌ కడప జిల్లా పొద్దుటూరు మండలంలోని కల్లూరుకు చెందిన పేరుమాళ్ల కిట్టయ్య ఎడ్లు 2,203.2 దూరం లాగి 6వ స్థానంలో నిలిచి రూ.30 వేలు, వైఎస్సార్‌ కడప జిల్లా గోసపాడు మండలంలోని జిల్లెల గ్రామానికి చెందిన గొటిక దినేష్‌రెడ్డి, హేత్విక్‌ రెడ్డిల ఎడ్లు 2,157.8 దూరం లాగి 7వ స్థానంలో నిలిచి రూ.25 వేలు, వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం గ్రామనికి చెందిన గుత్తి అధిల్‌, మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలోని కొండపేట గ్రామానికి చెందిన మీనిగ కాశయ్యల ఎడ్లు 2,071.10 అడుగుల దూరం లాగి 8వ స్థానంలో నిలిచి రూ.20 వేలు, బాపట్ల జిల్లా బల్లికురవ గ్రామానికి చెందిన పావులూరి వీరాస్వామి చౌదరి ఎడ్లు 1,823.6 దూరం లాగి 9వ స్థానంలో నిలిచి రూ.10 వేల ప్రకారం నగదు బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల కన్వీనర్‌ ఏకుల ముసలారెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి వై.వెంకటేశ్వరరెడ్డి, వైస్‌ ఎంపీపీ మందుల ఆదిశేషు, నాయకులు టి.సత్యనారాయణరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, మిడత నరసింహారావు, హరినాయక్‌ పాల్గొన్నారు.

ముగ్గుల పోటీల్లో...

పెద్దారవీడు మండలంలోని బోడ్రెడ్డిపల్లెకు చెందిన దుగ్గెంపూడి వీరమ్మకు ప్రథమ బహుమతి ఫ్రిజ్‌, యర్రగొండపాలెంకు చెందిన గ్రంధి శ్రీలక్ష్మి ద్వితీయ బహుమతి వాషింగ్‌ మిషన్‌, పెద్దదోర్నాల మండలంలోని యడవల్లికి చెందిన పొందుగుల మల్లేశ్వరి తృతీయ బహుమతి గ్రైండర్‌, త్రిపురాంతకంకు చెందిన మద్దులూరి పద్మావతి చతుర్ధ బహుమతి మిక్సి, యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లె గ్రామానికి చెందిన చితిరాల లావణ్య 5వ బహుమతి రైస్‌ కుక్కర్‌ అందుకున్నారు. కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు ఉడుముల అరుణ, కె.వి.సుజాత, ఆర్‌.అరుణాబాయి, సూరె వసుంధర, కందూరి అంజలి, కె.వాసవి, పల్లె సరళ, శార, వాడాల పద్మ, పబ్బిశెట్టి పద్మ, పొన్నా వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

యర్రగొండపాలెం: ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో భాగంగా చివరి రోజున జరిగిన సీనియర్స్‌ విభాగంలో నంద్యాల, మార్కాపురం జిల్లాలకు చెందిన ఎడ్లు 2772.1 అడుగు దూరంలాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఎడ్ల యజమానులు నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఎస్‌.కొత్తూరు, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం ఒంగోలు పార్ధు గురు వెంకటరెడ్డి రూ.1.50 లక్షల నగదు బహుమతి అందుకున్నారు.

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీల విజేతలకు మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement