నరసింహ స్వామి వారి గ్రామోత్సవం
మంగళగిరి టౌన్ : సంక్రాంతి వేళ మంగళగిరి పట్టణంలోని వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గ్రామోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామోత్సవం దేవస్థానం నుంచి బయలుదేరి ఆయా ప్రాంతాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో సునీల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రత్తిపాడు: కాకుమాను మండలం కొండపాటూరులోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో గురువారం ఐక్యరాజ్య సమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన హరీష్‌కు దేవస్థానం చైర్మన్ పొన్నం వీరయ్య చౌదరి, కార్యనిర్వహణ అధికారి జక్కా శ్రీనివాసరావులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. వెంట కాటూరి మెడికల్ కళాశాల, హాస్పిటల్ అధినేత కాటూరి సుబ్బారావు ఉన్నారు.
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : క్రెడాయ్ గుంటూరు చాప్టర్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ శుక్రవారం ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆవిష్కరిస్తున్న డైరీలో పలు జీవోలు ఉంటాయన్నారు. దాంతోపాటు ప్రభుత్వ బిల్డింగ్ రూల్స్ కు సంబంధించిన వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. గుంటూరు చైర్మన్ ఆరుమళ్ళ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా క్రెడాయ్ గుంటూరు డైరీ ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. డైరీ ప్రింటింగ్‌కు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు చాప్టర్ అధ్యక్షుడు మామిడి రాము మాట్లాడుతూ గుంటూరు సభ్యులందరూ నేషనల్ క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం భవనాలు నిర్మిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి, ఉపాధ్యక్షులు వి శివ నాగేశ్వరరావు, గోన శివ నాగబాబు, బడే సుబ్బారెడ్డి, ఎం. శంకర్ రాజగోపాల్, పి సాహిత్, మెట్టు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్ : యుటీఎఫ్ (ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) మంగళగిరి ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉండవల్లి సెంటర్‌లో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు యు.రాజశేఖరరావు మాట్లాడుతూ గంజాయి మహమ్మారి నుంచి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లరాదని తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకున్న ఆశలను నిరాశపరచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్ తాడేపల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శి సత్య శివనాగేశ్వరరావు, మంగళగిరి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అరుణ్ కుమార్, చింత శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి యు. ఏడుకొండలు, సీఐటీయు నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, బాబూరావు, దుర్గారావు, మేరి తదితరులు పాల్గొన్నారు.
నరసింహ స్వామి వారి గ్రామోత్సవం


