ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి
ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి ● బడుగు శ్రీనివాస్ మాట్లాడుతూ టెట్ రద్దు కోసం ఫిబ్రవరి 5న ఆల్ ఇండియా జేఏసీ టీవో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పక్షాన ఢిల్లీలో జరిగే చలో పార్లమెంట్ మార్చ్‌కు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి రావాలన్నారు.
● ఇటీవల ఉద్యోగులకు చెల్లించిన కరువు భత్యం బకాయిల విషయంలో రిజెక్ట్ చేసిన బిల్లులు డీడీవోలు తిరిగి రీ–సబ్మిట్‌కు అవకాశం కల్పించకపోవడం వల్ల కరువు భత్యం బకాయిలు కొందరికి మాత్రమే జమ అయ్యాయని, పూర్తి బకాయిల చెల్లింపు జరగలేదని, తిరస్కరణకు గురైన బిల్లులు తిరిగి సమర్పించే అవకాశం ఇవ్వాలని కోరారు.
● రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇంతవరకు చేయలేదని వారి ఆర్థిక సమస్యల దృష్ట్యా మానవతా దృక్పథంతో వెంటనే చేపట్టాలన్నారు.
● జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి కల్పించాలన్నారు.
బాపట్లటౌన్: సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని జిల్లా ఎస్‌టీయూ అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఎస్‌టీయూ జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి పీవీ నాగరాజు, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ నూర్‌బాషా సుభాని, రాష్ట్ర కౌన్సిలర్లు గుగ్గిలం ఉదయ్ శంకర్, డీవీ సుబ్బారావు, వంకా ప్రభాకర్‌రావు, పి.శివాంజనేయులు, తోట శివయ్య, ఏవీ నారాయణ, బత్తుల నాగరాజు, బుజ్జిబాబు పాల్గొన్నారు.
ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షులు
బడుగు శ్రీనివాస్