సారా జోలికి వస్తే జిల్లా బహిష్కరణ
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ
బాపట్లటౌన్: నాటుసారా తయారుచేసినా..విక్రయించినా అలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేసి వారిని జిల్లా బహిష్కరణ చేస్తామని ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ హెచ్చరించారు. శనివారం మండలంలోని వెదుళ్లపల్లి, బేతపూడి గ్రామాల్లో నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. కె.విజయ మాట్లాడుతూ పదేపదే నాటుసారా తయారుచేస్తూ పట్టుబడిన వారిని ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. నాటుసారా తయారీకి ముడి సరుకు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రకాశం ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ ఎ.జనార్ధనరావు, బాపట్ల ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, బాపట్ల ఎకై ్సజ్ సీఐ పి.గీతిక, ఎస్‌ఐలు ప్రభుదాస్, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.


