కృష్ణా జిల్లా ఎడ్లు ముందంజ
పర్చూరు(చినగంజాం): బాపట్ల జిల్లా ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జోరుగా సాగుతున్నాయి. గ్రామంలోని వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి వార్ల తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థాయి పోలురాధ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. క్వింటాన్నర ఇసుక బస్తాలతో కూడిన చక్రాలు తిరగని ఎజ్ల బండిని పది నిమిషాల్లో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. పందాల్లో గెలిచిన ఎడ్ల జతలకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు బహుమతులుంటాయని వివరించారు. పోటీలలో రెండవ రోజు జూనియర్స్ విభాగంలో 18 ఎడ్ల జతలు పోటీలో పాల్గొన్నట్లు వారు తెలిపారు.


