వాడరేవు–పిడుగురాళ్ల రోడ్డుతో పెరగనున్న పర్యాటకులు
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి ఏర్పాటుకు ఆమోదం తెలపడంతోపాటుగా రూ.667 కోట్ల నిధులను కూడా విడుదల చేయించారు. ఈ రోడ్డు వాడరేవు నుంచి పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా నకరికల్లు అడ్డరోడ్డు వరకు 81.5 కిమీ మేర వెడల్పు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వాడరేవు–పిడుగురాళ్ల వరకు 47 కిలోమీటర్లు వరకు నాలుగులైన్ల జాతీయ రహదారిగా నిర్మాణాన్ని చేస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా అధికారులు, ప్రభుత్వం పనులను ముమ్మరంగా చేయిస్తుంది. ఈ రఽహదారి నిర్మాణంలో 37 కిలోమీటర్లు రోడ్డు బాపట్ల జిల్లా పరిధిలోనే ఉండటంతో జిల్లాకే తలమానికంగా మారనుంది. హైవే నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వస్తే జిల్లాకే మణిహారంలాగా ఉంటుందన్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం హైద్రాబాద్‌కు తక్కువ సమయంలో చేరుకోవడంతో పాటుగా తీరప్రాంతాలకు పర్యాటకులు అధికంగా వస్తారు.


