ఫిజియోథెరపి కౌన్సిల్ ఏర్పాటు చేయండి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్‌లో ఫిజియోథెరఫిస్ట్స్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యులను తక్షణమే నియమించాలని ఆంధ్రప్రదేశ్ ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాపట్ల వేంకటహరికృష్ణ కోరారు. ఈమేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.వెంకటేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ సుమైలను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫిజియోథెరఫిస్ట్స్ ప్రొఫెషన్ కౌన్సిల్ ప్రత్యేక సభ్యులను నియమించేందుకు గజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. నాటి గజిట్ ఆధారంగా కౌన్సిల్ ఏర్పాటు చేస్తే తమ సమస్యలు పరిష్కరించేందుకు తమకు అవకాశం కలుగుతోందన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ షేక్ సుభాని, రాష్ట్ర కమిటి సభ్యులు డాక్టర్ చెవుల ఏడుకొండలు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ గ్రేస్, డాక్టర్ ఇమ్రాన్‌ఖాన్, డాక్టర్ రాజేష్ రోషన్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ దయాకర్ తదితరులు ఉన్నారు. తొలుత నూతనంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటేశ్వరరావును ఫిజియోథెరఫిస్ట్స్ అసోసియేషన్ నేతలు బొకే అందజేసి సత్కరించారు.


