బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Apr 9 2025 2:09 AM | Updated on Apr 9 2025 2:09 AM

బాపట్

బాపట్ల

బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025
దరఖాస్తు ఇలా..

ఓటరు క్లెయిమ్‌ల విచారణ వేగవంతం చేయండి

ఆర్డీవో టి.చంద్రశేఖర నాయుడు

చీరాలటౌన్‌: చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న (బీఎల్‌వోలు) విధులను సమర్థంగా నిర్వహించి ఓటరు క్లైమ్‌ల విచారణ వేగవంతంగా చేయాలని ఈఆర్‌వో, ఆర్డీవో టి.చంద్రశేఖరనాయుడు సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో చీరాల నియోజకవర్గంలోని బీఎల్‌వోలతో ఆర్డీవో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ 106 చీరాల నియోజకవర్గంలో ఓటరు క్లెయిమ్‌ అర్జీలు పెండింగ్‌లో లేకుండా బీఎల్‌వోలు సమర్దవంతంగా పనిచేయాలన్నారు. ఓటరు క్లెయిమ్‌ అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అవాంతరాలు లే కుండా విచారణ చేయాలన్నారు. అభ్యంతరాల వివరాలను తెలియజేయాలన్నారు. ఇటీవల మృతిచెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రతీ బీఎల్‌వో వారికి కేటాయించిన పోలింగ్‌ బూత్‌లోని ఓటర్ల పూర్తి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. క్లెయిమ్‌ల విచారణలో ఈసీ నిబందనల ప్రకారం చేయాలని ఇష్టానుసారంగా విధులు నిర్వహించవద్దన్నారు. బీఎల్‌వోలకు ఉన్న ప్రతీ సమస్యలను తనకు గానీ, ఏఈఆర్వోలకు గాని తెలియజేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ కె.గోపికృష్ణ, ఎన్నికల డీటీ సుశీల, మున్సిపల్‌, వేటపాలెం మండలాల్లోని బీఎల్‌వోలు పాల్గొన్నారు. అలానే చీరాల ఆర్డీవో కార్యాలయంలో అన్నీ రాజకీయపార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశాన్ని నిర్వహించి ఓటరు క్లెయిమ్‌ల విచారణలకు సంబందించిన అన్నీ వివరాలను పార్టీల నాయకులకు వివరించారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం మంగళవారం 516.00 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌ – 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరో 15 రోజుల్లో ముగియనుంది. సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్‌–2025కు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets. apsche.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయ్యి ఏపీ ఈఏపీసెట్‌–2025ను ఎంపిక చేసుకోవాలి. ఏపీఈఏపీసెట్‌ సైట్‌లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్‌స్ట్రక్షన్స్‌ మాన్యువల్‌ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు.

ధ్రువపత్రాల వివరాలు తప్పనిసరి

● ఏపీ ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్‌ కేటగిరీల వారీగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో క్లిక్‌ చేయాలి. అదేవిధంగా సంబంధిత ధ్రువపత్రానికి సంబంధించిన నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌, ఆదాయ ధ్రువపత్రాల నంబరును సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు.

● విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్‌ ఇంటర్‌ వరకు ఏ విద్యాసంస్థల్లో, ఏ ఊరిలో చదివారనే వివరాలను ఆయా విద్యాసంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివర్లో ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్‌ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్‌ చేయాలి. ఉదాహరణకు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి తన సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్‌ ఎంపిక చేసుకున్నప్పటికీ, అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతరత్రా కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు.

● ఆన్‌లైన్‌ దరఖాస్తు పూర్తి చేసి సబ్‌మిట్‌ చేసిన తరువాత ప్రింటవుట్‌ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్‌తో పాటు ఆన్‌లైన్‌ ప్రింటవుట్‌ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.

7

న్యూస్‌రీల్‌

దరఖాస్తు చేసేందుకు ఈనెల 24 చివరి తేదీ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్ష మే 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27వరకు ఇంజినీరింగ్‌కు సంబంధించి టెస్ట్‌ దరఖాస్తు సమయంలో జాగ్రత్తలతో కౌన్సెలింగ్‌లో తొలగనున్న ఇబ్బందులు

ఏపీఈఏపీసెట్‌–2025 సైట్‌కు లాగిన్‌ అయిన తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఐదు దశల్లోని ప్రక్రియను పూర్తి చేయాలి. స్టెప్‌–1 మొదలు స్టెప్‌–5 వరకు ఐదు దశల్లో కనిపించే ట్యాబ్‌లను వరుస క్రమంలో క్లిక్‌ చేస్తూ, పొందుపర్చిన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్టెప్‌1: ‘ఎలిజిబులిటీ క్రైటీరియా అండ్‌ ఫీజు పేమెంట్‌’కు లాగిన్‌ అయ్యి సీనియర్‌ ఇంటర్‌ హాల్‌టికెట్‌ నంబరు ఎంటర్‌ చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్‌ నంబరు, ఆల్టర్నేటివ్‌ మొబైల్‌ నంబరు, ఈ–మెయిల్‌ ఐడీ నమోదు చేయాలి. దీంతో పాటు ఇంజినీరింగ్‌–ఫార్మసీ, అగ్రికల్చర్‌–ఫార్మసీ, బోత్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీల వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని, క్లిక్‌ చేయాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరీపై క్లిక్‌ చేసి, ఆన్‌లైన్‌లో ఫీజు పేమెంట్‌ చేయాలి. క్రెడిట్‌, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ మార్గాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంది.

స్టెప్‌–2: నో యువర్‌ పేమెంట్‌ స్టేట్‌స్‌పై క్లిక్‌ చేసి, సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌ నంబరు, మొబైల్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. తదుపరి చేరనున్న కోర్సుల వారీగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్‌ చేయడంతో స్టెప్‌–2 దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

స్టెప్‌–3: ఫిల్‌ అప్లికేషన్‌లో పేమెంట్‌ చేసిన ఐడీతో పాటు సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్‌ టు ఫిల్‌ అప్లికేషన్‌పై క్లిక్‌ చేయాలి.

స్టెప్‌–4: ఇక్కడ నో యువర్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు.

స్టెప్‌–5: ఇక్కడ క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకుని భద్రపరచుకోవాలి.

ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్‌ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్‌, పుట్టినతేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్‌, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి.

బాపట్ల1
1/9

బాపట్ల

బాపట్ల2
2/9

బాపట్ల

బాపట్ల3
3/9

బాపట్ల

బాపట్ల4
4/9

బాపట్ల

బాపట్ల5
5/9

బాపట్ల

బాపట్ల6
6/9

బాపట్ల

బాపట్ల7
7/9

బాపట్ల

బాపట్ల8
8/9

బాపట్ల

బాపట్ల9
9/9

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement