చీరాల మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు | - | Sakshi
Sakshi News home page

చీరాల మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు

Apr 6 2025 2:35 AM | Updated on Apr 6 2025 2:35 AM

చీరాల

చీరాల మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు

చీరాల: చీరాల మున్సిపల్‌ కమిషనర్‌ నియంత పోకడలు పోతున్నారు. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పట్టణ ప్రథమ పౌరుడు, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావును కార్యాలయంలోకి వెళ్లనీయకుండా గతంలో ఎన్న డూ లేని విధంగా సెక్యూరిటీని పంపి కార్యాలయానికి తాళం వేయించారు. ప్రతి ఏటా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు చైర్మన్‌ ఆధ్వర్యంలో కార్యాలయంలో జరుగుతాయి. ఈసారి మాత్రం చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారనే నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసిన కమిషనర్‌ కౌన్సిలర్లు, చైర్మన్‌లు కార్యాలయానికి వెళ్లకుండా తాళాలు వేయించారు. అదేమంటే బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి రోజున సెలవు దినమని ప్రచా రం చేయించారు. వాస్తవంగా అధికారులు, సిబ్బంది లేకున్నా చైర్మన్‌ తన ఛాంబర్‌లో మహనీయుల జయంతి వేడుకలను జరుపుకోవచ్చు. తహసీల్దార్‌ కార్యాలయంతోపాటు మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. కమిషనర్‌కు ఏమి ఆదేశాలు అందాయో ఏమోగాని రోజూ ఉండే సెక్యూరిటీ సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేయడం విశేషం. దీంతో చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, కౌన్సిలర్లు, వైఎస్సార్‌ సీపీ నాయకులు గేటు బయటనే జగ్జీవన్‌రామ్‌ చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చైర్మన్‌ను అవమానించేందుకే...

వారు మాట్లాడుతూ కమిషనర్‌ ఒక బీసీ చైర్మన్‌ను అవమానించేందుకే కార్యాలయానికి తాళాలు వేశారని ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. చైర్మన్‌నే లోపలికి రాకుండా తాళాలు వేశారంటే ఆ కమిషనర్‌కు ఉన్న అహంకారం అర్థమవుతుందన్నారు. కమిషనర్‌ను సస్పెండ్‌ చేసేంత వరకు పోరాడతామన్నారు. ఇటువంటి పరిస్థితి ఐదేళ్లలో ఎప్పుడూ జరగలేదని, ఇది చైర్మన్‌ను అవమానించడమేనన్నారు.

కమిషనర్‌ వైఖరిపై నిరసన

నిరసనగా మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కమిషనర్‌ డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. వైస్‌ చైర్మన్‌ శిఖాకొల్లి రామసుబ్బులు, కౌన్సిలర్లు గోలి జగదీష్‌, కంపా అరుణ్‌, గొట్టిపాటి ఎబినేజర్‌, కీర్తి వెంకట్రావు, బత్తుల అనిల్‌, గుంటూరు ప్రభాకరరావు, చీమకుర్తి బాలకృష్ణ, తోకల అనిల్‌, కో–ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ కబీర్‌, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు యాతం మేరిబాబు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షులు వాసిమళ్ల వాసు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ బరితెగింపు

బీసీ మున్సిపల్‌ చైర్మన్‌కు ఘోర అవమానం గేటు బయటనే బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

చీరాల మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు1
1/1

చీరాల మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement