బాపట్లలో పచ్చనేతల దుశ్చర్య
బాపట్ల : రోడ్డు విస్తరణకు సహకరించాడు...నిబంధనల ప్రకారం టెండర్లలో సైకిల్ స్టాండ్‌ను దక్కించుకున్నాడు. ఏరియా వైద్యశాలలో ఏమాత్రం ఉపయోగంలేని స్థలానికి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.32 వేలు అద్దె చెల్లిస్తున్నాడు..అయినా కూటమి సర్కారు అతనిపై కక్ష కట్టింది. సైకిల్ స్టాండ్ నిర్వాహకుడు వైఎస్సార్ సీపీ నాయకుడు కావడమే అందుకు కారణం. అతని సైకిల్ స్టాండ్ తొలగించాలంటూ పలు విధాలుగా కూటిమి నేతలు ప్రయత్నించారు. కోర్టులో వివాదం ఉన్నప్పటికీ ఎటువంటి ఆదేశాలు రాకముందే టీడీపీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని సూపరింటెండెంట్‌ను ముందుపెట్టి మరీ సైకిల్ స్టాండ్‌ను శుక్రవారం తొలగించారు. టీడీపీ నాయకుల హడావుడితో రైల్వేస్టేషన్ వద్ద గందరగోళం నెలకొంది.
బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలోని ఏరియా వైద్యశాల ఆవరణలో శ్రీనివాస సైకిల్ స్టాండ్‌ను వైఎస్సార్ సీపీ నాయకుడు నర్రావుల వెంకట్రావు పదేళ్ల కిందట టెండర్‌లో సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి నిబంధనల ప్రకారం అద్దె చెల్లిసూ వస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆ పార్టీ నేతల కన్ను సైకిల్ స్టాండ్‌పై పడింది. స్టాండ్‌ను తొలగించాల్సిందిగా సూపరింటెండెంట్ మౌఖిక ఆదేశాలు ఇవ్వగా వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించాడు. స్టాండ్ ఉన్నచోట అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ కోర్టుకు తప్పుడు పత్రాలను సమర్పించారు. ఈమేరకు కోర్టులో వివాదం కొనసాగుతుంది. అయితే సూపరింటెండెంట్ సిద్దార్థ ఎటువంటి నోటీసు ఇవ్వకుండా టీడీపీ నాయకులతోపాటు పోలీసులను, జేసీబీని తీసుకువచ్చి స్టాండ్ తొలగింపునకు పూనుకున్నారు. అక్కడ ఏమి జరుగుతుందో కొద్దిసేపటి వరకు అర్ధం కాకపోయిన వెంకట్రావు తనకు అన్యాయం చేయోద్దంటూ ప్రాథేయపడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, వెంకట్రావును పక్కన ఉన్న చల్లా రామయ్య అనే వ్యక్తిని లాగి పక్కనపడేశారు. టీడీపీ నాయకులు వెంకట్రావుపై దాడి చేస్తునప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. స్టాండ్ తొలగించేందుకు తనకు నోటీసు ఇవ్వాలని, అక్కడ ఉన్న వాహనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సూపరింటెండెంట్‌కు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తొలగింపు చర్యలు చేపట్టారు. దీంతో అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే టౌన్ సీఐ రాంబాబు వారిని వాదించి పక్కకు పంపివేశారు.
తన స్టాండ్ తొలగింపును అక్రమంగా చేపట్టారంటూ సూపరింటెండెంట్ సిద్దార్థ, సీఐ రాంబాబు, టీడీపీ నాయకుడు గవిని శ్రీనివాసరావులపై డీఎస్పీ రామాంజనేయులకు బాధితుడు వెంకట్రావు ఫిర్యాదు చేశారు. కోర్టులో వివాదం ఉన్నప్పుడు నిబంధనకు విరుద్ధంగా స్టాండ్ తొలగించటం, అందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు తనకు జరిగిన అన్యాయంపై మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోతామని తెలిపారు.
డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వెంకట్రావు
తీసుకువచ్చిన గంజాయిని పొడి చేసి పొట్లాలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. న్యూగుంటూరు రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాలనీ, మణిపురం ఓవర్‌బ్రిడ్జీ కింద, పాతగుంటూరు సుద్దపల్లి డొంక, నందివెలుగు రోడ్డులోని ఉన్న ఒక ఖాళీ వెంచర్, గుజ్జగుండ్ల సెంటర్ సమీపం, శారదాకాలనీ, కృష్ణబాబుకాలనీ, ఐపీడీకాలనీ, సంపత్‌నగర్‌లోని కొబ్బరితోట ప్రాంతం, కేవీపీ కాలనీలో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు అధికంగా జరుగుతున్నట్టు సమాచారం. లిక్విడ్, సిగరెట్ల రూపంలోనూ గంజాయిని విక్రయిస్తున్నారు.
కోర్టు వివాదంలో ఉండగా
సైకిల్ స్టాండ్ తొలగింపు
సీఐతోపాటు పలువురిపై
డీఎస్పీకి ఫిర్యాదు
మానవ హక్కుల కమిషన్
దృష్టికి తీసుకెళతామన్న బాధితుడు
బాపట్లలో పచ్చనేతల దుశ్చర్య


