నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఎస్సీ వర్గీకరణపై రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభ, మండలిలో ఆమోదించిన కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌కుమార్ మండిపడ్డారు. మాలమహానాడు ఆధ్వర్యంలో లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోళ్ల అరుణ్‌కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో బాబు ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చుపెడుతోందని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో హాలో మాల.. చలో రాజధాని పేరుతో లక్షలాది మందితో మాలల సింహాగర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమలో మాలమహానాడు నాయకులు గోదాజాన్‌పాల్, దారా హేమప్రసాద్, పిల్లి మేరి, ఏసుబాబు, బోరుగడ్డ రజనీకాంత్, రాచకొండ ముత్యాలరాజు, బండ్లమూడి స్టాలిన్, నల్లపు నీలాంబరం, సముద్రాల కోటి, డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో లక్షలాది మందితో హలో మాల.. చలో రాజధాని కార్యక్రమం మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌కుమార్