ఎంఎస్‌ఎంఈ పార్కు భూముల పరిశీలన
మార్టూరు: మార్టూరులో బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ శనివారం ఉదయం పర్యటించారు. స్థానిక నాగరాజు పల్లి సెంటర్లో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్ కుడివైపున ఉన్న పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌ను ఎడమవైపు వెనుకగా ఉన్న ఇరిగేషన్ శాఖకు చెందిన శిథిలావస్థలో ఉన్న బిల్డింగును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన తహసీల్దార్ టి. ప్రశాంతితో మాట్లాడుతూ అన్న క్యాంటీన్ ఐదు సెంట్లు భూమి మినహా మిగిలిన 26 సెంట్లు భూమిలో శిథిలావస్థకు చేరిన ఇరిగేషన్ శాఖ కార్యాలయాన్ని తొలగించి రెవెన్యూ శాఖ ఆధీనంలో ల్యాండ్ బ్యాంకుగా ఉంచుకోవాలని సూచించారు. ఈ భూమిని ప్రజావసరాలకు అవసరమయ్యే పనులకు వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి నాగరాజు పల్లి గ్రామానికి దక్షిణంగా ఉన్న కొండ సమీపంలో గతంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ కోసం ఎంపిక చేసిన సర్వే నంబర్ 475 లోని 53 ఎకరాల కొండ పోరంబోకు భూమిని పరిశీలించారు. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన 445, 453, 476 సర్వే నెంబర్ల లోని 85 ఎకరాల ప్రభుత్వ భూమి ని కూడా ఆయన పరిశీలించారు. కార్యక్రమం లోచీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీల్దార్ ప్రశాంతి, సర్వేయర్ ఏడుకొండలు, ఎంపీడీవో కార్యాలయం ఏవో రాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్షర ఆంధ్ర–ఉల్లాస్ జయప్రదంగా
నిర్వహించాలి
బాపట్ల: అక్షర ఆంధ్ర– ఉల్లాస్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంపై ఎంపీడీవోలు, ఎంఈఓలతో శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మార్చినాటికి 51,786 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయాలని కలెక్టర్ చెప్పారు. ఆ దిశగా అధికారులు పనిచేయాలని, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన యాప్‌లో వివరాలను నిక్షిప్తం చేయాలన్నారు. విద్యార్థుల బయోమెట్రిక్ నవీకరణ 7,651 పెండింగ్‌లో ఉందని, తక్షణమే లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
మార్టూరులో కలెక్టర్ పర్యటన