పోలీస్ శాఖలో పేపర్‌లెస్ సేవలు
● ఈఎస్‌ఎం ప్రక్రియను 100 శాతం
పూర్తిచేసిన జిల్లాగా బాపట్ల ఎంపిక
● అధికారుల సమీక్ష సమావేశంలో
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్ల టౌన్: పోలీస్ శాఖలో భవిష్యత్‌లో పేపర్‌లెస్ విధానంలోనే అన్నిరకాల సేవలు అందించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఈ–ఆఫీస్ పనితీరుపై డీపీవో అధికారులతో శనివారం ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంప్లాయి సర్వీస్ మాడ్యూల్స్(ఈఎస్‌ఎం) ప్రక్రియను వందశాతం పూర్తి చేసిన మొట్టమొదటి జిల్లాగా బాపట్ల పోలీస్ శాఖ నిలిచిందన్నారు. భవిష్యత్తులో పేపర్ వినియోగం లేకుండా సాంకేతికత ద్వారానే పోలీస్ శాఖ సేవలు అందించడంలో ఈ–ఆఫీస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాలు, జిల్లా పోలీస్ కార్యాలయం ప్రతి విభాగం ఈ–ఆఫీస్‌తో అనుసంధానం కాబోతున్నాయన్నారు. ఈ ప్రక్రియపై సిబ్బందికి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.


