శనగ రైతుకు నష్టాల సెగ
పర్చూరు (చినగంజాం): గోదాముల్లో నిల్వ చేసిన శనగలు విక్రయిద్దామంటే ధర అంతంత మాత్రమే ఉంది. వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.5,875. కానీ మార్కెట్‌లో దాదాపు రూ.800 తక్కువగా పలుకుతోంది. 2023–24 సీజన్‌లో రూ.10 వేలు పలికింది. ఇప్పుడు రూ.5100 పలుకుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శీతల గోదాముల్లో భారీగా నిల్వలు మూలుగుతున్నాయి. మున్ముందు ధర పెరుగుతుందన్న ఆశతో అప్పు తెచ్చి మరీ కొత్త పంటలు వేస్తున్నారు. రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా శనగ సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గతేడాది సీజన్ ప్రారంభంలో ప్రకటించారు. ఆ హామీని నిలబెట్టుకోక పోవడంతో రైతులు అప్పులు తెచ్చి మరీ సాగు చేపట్టారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో వరుసగా నాలుగేళ్లు శనగలు సొసైటీల ద్వారా, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన నాలుగైదు రోజులలో రైతుల అకౌంట్‌లలో నగదు జమ అయింది.
పొగాకు, పత్తి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేని సందర్భాల్లో ప్రత్యామ్నాయ పంటగా శనగను ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. రబీలో ప్రధాన పంట శనగ కావడంతో పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. విత్తనాలు, మందులు, కూలీల ఖర్చు రూ.45 వేలు, కౌలు రూ.25 వేలు అవుతోంది. గతంలో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగబడి వచ్చేది. ప్రస్తుతం తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలతో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. దిగుబడి తగ్గడం, ధర లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరతో ఎకరాకు సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం మిగులుతోంది.
విదేశీ శనగల దిగుమతుల కారణంగా కూడా రైతులు కుదేలవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యాపార ఒప్పందంలో భాగంగా ఆస్ట్రేలియా, టాంజానియా, కెనడా, మయన్మార్ వంటి దేశాల నుంచి ఎర్ర, తెల్ల శనగలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. విదేశాల నుంచి నాణ్యమైన శనగలు తక్కువ ధరకే వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో లక్షల క్వింటాళ్ల విదేశీ శనగలు దిగుమతి చేసుకోవడంతో వ్యాపారులు స్వదేశీ శనగలను కొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో కూడా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలో శనగలు 80 లక్షల టిక్కీలు నిల్వ ఉన్నాయి. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు గిట్టుబాటు ధర కల్పించేలా తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ విధానం సరిగా లేదు
ఏటా వంద ఎకరాల వరకు శనగ సాగు చేపడతా. ప్రస్తుత పరిస్థితిలో ధరలు దారణంగా ఉన్నాయి. విదేశీ దిగుమతుల కారణంగా ధరలు భారీగా పడిపోయాయి. దీని గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొంత కాలంగా ధరలు లేక గోదాముల్లో నిల్వ ఉండిపోయాయి. మోదీ ప్రవేశ పెట్టిన విధానంతో రైతులకు ధరలు ఆశాజనకంగా లేవు. విదేశాలకు ఎగుమతులు చేపడితే తప్ప రైతుకు గిట్టుబాటు ధల లభించే పరిస్థితి లేదు.
దారుణంగా పడిపోయిన ధర
శనగల ధర దారుణంగా పడిపోయింది. తెల్ల శనగలు (కాక్ 2) నాలుగేళ్ల నుంచి గోదాముల్లో నిల్వ ఉన్నాయి. జగన్ హయాంలో క్వింటా రూ.10 వేలు ఉంది. ప్రస్తుతం రూ.5,100 పలుకుతోంది. జేజే 11 రకం రూ.8 వేలు అమ్మగా.. ఇప్పుడు రూ.4900 వరకు ప్రస్తుత ధర ఉంది. గిట్టుబాటు ధర ఎప్పుడు వస్తుందా..అని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టడం లేదు.
పెరిగిన పెట్టుబడులు
విదేశీ దిగుమతులతో కుదేలు
– నరిశెట్టి శ్రీనివాసరావు, ఇనగల్లు, పర్చూరు మండలం
– సింహాద్రి బ్రహ్మారెడ్డి, పావులూరు, ఇంకొల్లు మండలం
చంద్రబాబు సర్కార్ వచ్చాక
అంతా మొండిచేయి
శనగ పంటకు దక్కని గిట్టుబాటు ధర
విదేశాల నుంచి దిగుమతితో
భారీగా ధర పతనం
జగన్ ప్రభుత్వ హయాంలో
మంచి లాభాలు
ఆరుగాలం కష్టించి పండించిన శనగ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు సీజన్‌లుగా తెల్ల శనగ అమ్ముకునే పరిస్థితి లేక శీతల గోదాముల్లో నిల్వ చేసుకొని గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నారు. మరో రెండు నెలల్లో కొత్త పంట చేతికి రాబోతున్న సమయంలో మరింత ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు సర్కార్ వచ్చాక పరిస్థితి దిగజారిపోయిందని వాపోయారు.
1/3
శనగ రైతుకు నష్టాల సెగ
2/3
శనగ రైతుకు నష్టాల సెగ
3/3
శనగ రైతుకు నష్టాల సెగ