దత్త పీఠంలో ముగిసిన సంక్రాంతి సంబరాలు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు సంబంధించి ఎగువ, దిగువ సన్నిధుల్లో స్వామివారికి, రాజ్యలక్ష్మి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన వస్త్రాలను నేడు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేలం పాట ఆదివారం ఉదయం 9 గంటలకు దిగువ సన్నిధిలోని ఆలయ ఆవరణలో జరుగుతుందని, ఆసక్తిగల భక్తులు వేలంపాటలో పాల్గొనాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.
గుంటూరురూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఇలవేల్పుదేవత శ్రీ పుట్టలమ్మతల్లి, శ్రీ ఘంటాలమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలందుకున్న లడ్డూ వేలంను శ్రీరామ్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి ఏటా హోరాహోరీగా సాగే వేలంలో భక్తులు పాల్గొని అమ్మవారి 9 కిలోల ప్రసాదం లడ్డూను దక్కించుకుంటారు. ఈ సారీ పోటాపోటీగా సాగిన వేలంలో గ్రామాని కి చెందిన అమ్మవారి భక్తుడు ఇమడాబత్తిని నాగేశ్వరరావు రూ.15,50,000లకు సొంతం చేసుకున్నారు. అనంతరం లడ్డూను వేలంలో పాడుకున్న భక్తునికి ఆలయ కమిటీ చైర్మన్ ఇంటూరి అంజిరెడ్డి దాతలు ఇంటూరి వీరారెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు అందజేసిన 9 గ్రాముల అమ్మవారి బంగారు లాకెట్‌ను అందజేశారు.
తెనాలిఅర్బన్: తెనాలి మారీసుపేటలోని దయామణి ఇంగ్లిషు మీడియం స్కూల్ 16వ వార్షికోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఆస్ట్రేలియా దేశంలోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అత్తోట విద్యాసాగర్, ఆయన బృందం పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ఉపాధ్యాయులు తెలుగు సంప్రదాయ పద్ధతిలో చీరలు, పంచెలు ధరించి సందడి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అత్తోట హేమలత, ప్రవాస భారతీయులు దాసరి చంద్రమౌళి, టి.రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.
దత్త పీఠంలో ముగిసిన సంక్రాంతి సంబరాలు
దత్త పీఠంలో ముగిసిన సంక్రాంతి సంబరాలు


