Daily Horoscope: 10 జూలై నుంచి 16 జూలై 2022 వరకు

Weekly Horoscope Telugu 10-07-2022 To 16-07-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. గృహయోగం. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయరంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారరంగం వారికి అన్ని విధాలా అనుకూల సమయం. ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.  కొన్ని వివాదాలకు సంబంధించి చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు. విద్యార్థులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. పారిశ్రామికవర్గాల వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువుల నుండి సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. టెక్నాలజీరంగం వారికి శుభవార్తలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. యుక్తితో వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపారవర్గాలు ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో చికాకు తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.  వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం.  నేరేడు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు తీరతాయి. వాహన, గృహయోగాలు కలిగే సూచనలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం మధ్యలో ఆరోగ్యం మందగిస్తుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. కష్టపడ్డా ఫలితం కనిపించనిస్థితి. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితి. ఉద్యోగాలలో ఇతరుల ఆధిపత్యం పెరిగి ఇబ్బందిపడతారు. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆప్తులతో వాగ్వాదాలు నెలకొంటాయి. వాహనాలు, భూముల కొనుగోలు. ఆస్తులు విషయంలో కొత్త ఒప్పందాలు. వ్యాపారవర్గాల కృషి ఫలిస్తుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో  బంధువులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం.  నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారమవుతుంది. వాహనయోగం. నిరుద్యోగులు ఇంటర్వూ్యలు అందుకుంటారు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు ప్రారంభించి సమయానుసారం పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. నేరేడు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. కళారంగం వారి యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top