వారఫలాలు: 01 జనవరి నుంచి 07 జనవరి 2023 వరకు

Weekly Horoscope Telugu 01-01-2023 T0 07-01-2023 - Sakshi

మేషం
అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఆప్తులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.  కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు యత్నాలు సఫలం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం
విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పనులు సజావుగా కొనసాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవితభాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం.  వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణభారాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.  వ్యాపారాలు విస్తరణకు  నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం
ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుంచి ధనలాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. బంధువిరోధాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం
చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో  ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. శ్రమాధిక్యం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య
కొన్ని వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. అనుకున్నంత సొమ్ము సమకూరి అప్పులు సైతం తీరతాయి. నిరుద్యోగులు జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తిలాభాలు ఉండవచ్చు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో పైస్థాయి వారి సహాయం అందుతుంది. రాజకీయవర్గాలకు మరింత అనుకూలమైన సమయం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల
రహస్య సమాచారాలు తెలుసుకుంటారు. ఆశించినంతగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి.  కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్ధులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి.  చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.  అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంతమేర తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో భూవివాదాలు. సోదరులతో కలహాలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
ఏ పని చేపట్టినా విజయమే ఉంటుంది. సన్నిహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు, సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. నూతన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులతో  పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది.  వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చిన్ననాటి మిత్రులతో  ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

మకరం
కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పనులు చకచకా పూర్తి చేస్తారు.  ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

కుంభం
కొత్త వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.. ఇంటి నిర్మాణప్రయత్నాలు కలసివస్తాయి.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీనం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సోదరులు, మిత్రులతో కొన్ని విషయాలలో  తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.   కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగ యత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి, విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నూతన పరిచయాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

శనిగ్రహ సంచారంలో మార్పు.. ఫలితాలు..
ఇంతవరకూ మకరరాశిలో సంచరించిన శనిగ్రహం జనవరి (2023) 17 నుండి కుంభరాశిలోకి ప్రవేశించి రెండున్నరేళ్లు సంచరిస్తాడు. అయితే ఈరాశి కూడా శని స్వక్షేత్రం కావడం కొంత ఊరట. ఇక వివిధ రాశుల వారిపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేషం: వీరికి రానున్న కాలమంతా శుభదాయకమే. ఇంతకాలం పట్టిపీడించిన సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే, ఆస్తులు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

వృషభం: వీరికి మిశ్రమంగా ఉంటుంది. అయితే లాభాలు కూడా కలుగజేస్తాడు. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. గంగాస్నాన  యోగం. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.

మిథునం: వీరికి గత రెండున్నరేళ్లుగా కలిగిన ఇబ్బందులు, కష్టాలు తొలగుతాయి. అయితే ఆరోగ్యపరంగా చికాకులు ఉండవచ్చు. కొంత శ్రద్ధ వహించాలి. తండ్రి తర ఫు వారితో మనస్పర్థలు. మానసిక అశాంతి.

కర్కాటకం: వీరికి అష్టమశని ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రతి వ్యవహారంలోనూ తొందరపాటు వద్దు. ఇక ఖర్చులు అధికమవుతాయి. ఏదో ఒక సమస్యతో ఇబ్బందిపడతారు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడనక సాగుతాయి. కొందరికి బదిలీలు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

సింహం: వీరు వ్యూహరచన చేస్తే తిరుగుండదు. అలాగే, ధననం సమకూరినా ఖర్చులకు కూడా వెనుకాడరు. అయితే కొందరి వ్యక్తుల ద్వారా కొంత ఇబ్బందిపడే సూచనలు. అలాగే, జీవిత భాగస్వామితో కూడా మాటపట్టింపులు ఉండవచ్చు.

కన్య: వీరికి అన్ని విధాలా శుభదాయకంగా ఉంటుంది. వ్యవహారాలన్నీ సజావుగా పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో శుభవార్తలు. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్యససమస్యలు తీరతాయి.

తుల: మనోనిబ్బరం తగ్గుతుంది. ఏ పని చేయాలన్నా బద్ధకం, జాప్యం. ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థిక విషయాలు కొంత గందరగోళంగా ఉండవచ్చు. అయితే అవసరాలకు తగినంతగా సమకూరుతుంది. విద్యార్థులు ఆచితూచి ముందుకు సాగాలి. కొందరు విదేశాల నుండి తిరిగి వచ్చే అవకాశం. 

వృశ్చికం: వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం. అందువల్ల ఆరోగ్య, కుటుంబ విషయాలలో నిర్లక్ష్యం వద్దు. అలాగే, వ్యాపార, ఉద్యోగాలలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తగదు. నమ్మిన వ్యక్తులే కొంత ఎదురుతిరిగే అవకాశం. కొంత సొమ్ము కూడా నష్టపోయే వీలుంది. 

ధనుస్సు: వీరికి లాభదాయకమైన కాలం. ముఖ్యంగా వీరికి ఏల్నాటి శని తొలగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంపద సమకూర్చుకునే విషయంలో విజయం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి.

మకరం: కుటుంబంలో సమస్యలు. కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. తరచూ ప్రయాణాలపై ఆసక్తి చూపుతారు. మనస్సు చంచలంగా ఉంటుంది.

కుంభం: జన్మరాశిలోకి ప్రవేశం వల్ల వీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎదురుచూడని ప్రయాణాలు చేస్తారు. మనశ్శాంతి లోపిస్తుంది. శ్రమ మరింత పడాల్సిన సమయం. అయితే కొంతలోకొంత అప్పుడప్పుడు శుభదాయకంగా ఉంటుంది.

మీనం: వీరికి ఏల్నాటి శని ప్రార ంభమవుతుంది. జీవితంలో మొదటిసారి శని వచ్చిన వారికి అధికంగానూ, మిగతా వారికి స్వల్పంగానూ ఈ ప్రభావం కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. అలాగే, ఖర్చుల విషయంలో తొందరపాటు వద్దు. బంధుమిత్రులతో విరోధాలు. మనశ్శాంతి లోపిస్తుంది.

మొత్తంమీద ఆయా రాశులపై శనిగ్రహ ప్రభావం పై విధంగా ఉండవచ్చు. అనుకూలంగా లేని వారు శనీశ్వరునికి తైలాభిషేకాలు, హనుమాన్‌కు అర్చనలు చేయించడం మంచిది. శుభంభూయాత్‌...

- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top