Horoscope Today: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు..

Today Panchangam 21 February 2024 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.ద్వాదశి ప.12.39 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: పునర్వసు ప.3.32 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: రా.12.07 నుండి 1.47 వరకు, దుర్ముహూర్తం: ప.11.51 నుండి 12.39 వరకు, అమృత ఘడియలు: ప.1.02 నుండి 2.44 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.29, సూర్యాస్తమయం: 5.58. 

మేషం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు.పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

కర్కాటకం: పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. 

సింహం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

కన్య: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల: కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: నూతన ఉద్యోగప్రాప్తి. సమాజసేవలో భాగస్వాములవుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.

కుంభం: పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మీనం: బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
 

whatsapp channel

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top