ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు..

Today Horoscope Telugu-26-10-2021 - Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి బ.షష్ఠి పూర్తి (24గంటలు), నక్షత్రం ఆరుద్ర తె.4.08 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి పునర్వసు, వర్జ్యం ఉ.10.55 నుండి 12.43 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుండి 9.05 వరకు తదుపరి రా.10.31 నుండి 11.21 వరకు అమృతఘడియలు... సా.5.06 నుండి 6.50 వరకు.

సూర్యోదయం : 6.00
సూర్యాస్తమయం    :  5.30
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహనసౌఖ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.. 

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు  సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. వస్తులాభాలు. ఆలయాల దర్శనాలు. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. దూరప్రయాణలు. అనుకోని ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.  మిత్రుల నుంచి ఒత్తిడులు.

సింహం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. స్థిరాస్తి వృద్ధి. 

తుల: ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం: పట్టుదల పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక అశాంతి. విలువైన వస్తువుల జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

ధనుస్సు: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు.

మకరం: రాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. 

కుంభం: వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. బందువులతో విరోధాలు. ప్రయత్నాలు అనుకూలించవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు మానసిక ఆందోళన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. బంధువుల నుంచి సమస్యలు. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top