శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి శు.త్రయోదశి రా.2.30 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం పుబ్బ ఉ.8.20 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం ప.3.40 నుండి 5.15 వరకు, దుర్ముహూర్తం ఉ.9.55 నుండి 10.44 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు...రా.1.24 నుండి 3.02 వరకు. తమిళ (సౌర) సంవత్సరాది.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: కుటుంబంలో స్వల్ప వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృషభం: మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
మిథునం: మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులలో జాప్యం. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మరింత పనిభారం.
సింహం: అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక.వాహనయోగం. ఆస్తుల కొనుగోళ్లు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కన్య: మిత్రులు, బంధువులతో అకారణ వైరం. కుటుంబంలో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
తుల: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఇంటాబయటా అనుకూలం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
వృశ్చికం: రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చర్చల్లో పురోగతి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
ధనుస్సు: కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
మకరం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.
కుంభం: మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మీనం: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.


