ఈ రాశి వారికి పనులలో విజయం. భూవివాదాలు తీరతాయి | Today Horoscope Telugu-03-01-2022 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి పనులలో విజయం. భూవివాదాలు తీరతాయి

Jan 3 2022 6:10 AM | Updated on Jan 3 2022 6:11 AM

Today Horoscope Telugu-03-01-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.పాడ్యమి రా.10.25 వరకు, తదుపరి విదియ నక్షత్రం పూర్వాషాఢ ప.3.22 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం రా.10.54 నుండి 12.24 వరకు, దుర్ముహూర్తం ప.12.25 నుండి 1.10 వరకు, తదుపరి ప.2.37 నుండి 3.21 వరకు అమృతఘడియలు... ఉ.10.51 నుండి 12.22 వరకు.

సూర్యోదయం :  6.35
సూర్యాస్తమయం :  5.33
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

రాశి ఫలాలు:

మేషం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం.... కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువర్గంతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం.... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభ సూచనలు. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో పురోగతి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకం... పనులలో విజయం. భూవివాదాలు తీరతాయి. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

సింహం... రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య.... బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

తుల.... కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి. వాహనయోగం. ముఖ్యులతో చర్చలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశలు చిగురిస్తాయి.

వృశ్చికం... కుటుంబంలో కొన్ని చికాకులు. దైవదర్శనాలు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు.... వేడుకలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులలో పురోగతి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూలిస్తాయి.

మకరం.... కుటుంబంలో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కష్టానికి ఫలితం కనిపించదు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఆటుపోట్లు.

కుంభం.... ప్రముఖులతో పరిచయాలు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

మీనం... నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement