ఈ రాశి వారు ఆస్తులు కొనుగోలు చేస్తారు | Rasi Phalalu: Daily Horoscope On 26-01-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు ఆస్తులు కొనుగోలు చేస్తారు

Jan 26 2026 4:16 AM | Updated on Jan 26 2026 12:05 PM

Rasi Phalalu: Daily Horoscope On 26-01-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.అష్టమి రా.7.09 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: అశ్విని ప.10.58 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ఉ.7.12 నుండి 8.43 వరకు, తదుపరి రా.7.59 నుండి 9.29 వరకు, దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.19 వరకు, తదుపరి ప.2.45 నుండి 3.32 వరకు,అమృత ఘడియలు: తె.4.57 నుండి 6.27 వరకు, భీష్మాష్టమి.

సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం :  5.48
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం.... పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం.... సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చిక్కులు.

మిథునం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం.... మిత్రుల నుండి శుభవార్తలు. పనుల్లో విజయం. ధనలాభం. ప్రముఖుతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

సింహం.... వ్యవహారాలలో అవాంతరాలు. బంధువర్గంతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కన్య..... కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మానసిక అశాంతి.

తుల.... సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

వృశ్చికం.. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  నూతనోత్సాహం.

ధనుస్సు.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం..... వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

మీనం... బంధువులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం. మనశ్శాంతి లోపిస్తుంది. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement