ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి వృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 25-01-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. స్థిరాస్తి వృద్ధి

Jan 25 2026 3:55 AM | Updated on Jan 25 2026 11:21 AM

Rasi Phalalu: Daily Horoscope On 25-01-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.సప్తమి రా.9.11 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: రేవతి ప.12.15 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: సా.4.16 నుండి 5.03 వరకు, అమృత ఘడియలు: ఉ.9.57 నుండి 11.30 వరకు, తదుపరి తె.4.09 నుండి 5.40 వరకు (తెల్లవారితే సోమవారం), రథసప్తమి.

సూర్యోదయం :  6.38
సూర్యాస్తమయం :  5.47
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం.... పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృషభం.. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం..... శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కర్కాటకం.... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలయ దర్శనాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

సింహం.... ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కన్య.... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల.... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీమాటే చెల్లుతుంది.

వృశ్చికం... ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

ధనుస్సు...... పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మకరం...... విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కుంభం..... ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం... సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement