ఈ రాశి వారికి గృహ, వాహనయోగాలు | Rasi Phalalu: Daily Horoscope On 23-03-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి గృహ, వాహనయోగాలు

Mar 23 2026 3:55 AM | Updated on Mar 23 2026 5:02 AM

Rasi Phalalu: Daily Horoscope On 23-03-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.పంచమి రా.9.50 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: కృత్తిక రా.11.57 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: ప.12.44 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: రా.9.42 నుండి 11.11 వరకు, శ్రీపంచమి.

సూర్యోదయం : 6.06
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం.. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలు వాయిదా. శారీరక రుగ్మతలు బాధిస్తాయి.

వృషభం..... స్నేహితుల నుంచి కీలక సమాచారం. దేవాలయ దర్శనాలు. కుటుంబసౌఖ్యం. గృహ, వాహనయోగాలు. ప్రముఖులతో  చర్చలు ఫలిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం.

మిథునం..... కార్యక్రమాల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. సోదరులు, స్నేహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం.... చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనసౌఖ్యం. కీలక సందేశం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు. ధనలబ్ధి. వ్యాపారులు  లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు ముఖ్య సమాచారం అందుకుంటారు.

సింహం... ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. ఇంటి విషయాలపై శ్రద్ధ. బంధువుల సహకారం. రాబడి పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కన్య..... స్నేహితుల నుంచి ఒత్తిడులు. వ్యయప్రయాసలు. అగ్రిమెంట్లు వాయిదా. కష్టమే మిగులుతుంది. ఆరోగ్యసమస్యలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు నిరుత్సాహం.

తుల... ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడులు. ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు. శారీరక రుగ్మతలు. బంధువులతో తగాదాలు.

వృశ్చికం..... భాగస్వామ్య వ్యాపారాలలో వృద్ధి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. అంచనాలు నిజమవుతాయి. కుటుంబసభ్యులతో సఖ్యత. వాహనయోగం. ఉద్యోగులు సంతోషకర సమాచారం అందుకుంటారు.

ధనుస్సు.... కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆహ్వానాలు రాగలవు. కార్యజయం. పట్టుదలతో ముందుకు సాగుతారు. విద్యావకాశాలు. వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి.

మకరం... వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు. కార్యక్రమాలలో  జాప్యం. అంచనాలలో పొరపాట్లు. వ్యాపారులు లాభాల కోసం శ్రమించాలి. ఉద్యోగులకు హోదాలు చేజారతాయి.

కుంభం.. ఆకస్మిక ప్రయాణాలు. రాబడికి మించి ఖర్చులు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారులు డీలాపడతారు. ఉద్యోగులకు కష్టమే మిగులుతుంది.

మీనం... నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లాభాలు. యత్నకార్యసిద్ధి. అత్యంత కీలక సమాచారం. దేవాలయ దర్శనాలు. విందువినోదాలు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement