గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చవితి రా.12.09 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: భరణి రా.1.34 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం: ప.11.59 నుండి 1.31 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.19 వరకు, అమృత ఘడియలు: రా.9.01 నుండి 10.31 వరకు.
సూర్యోదయం : 6.07
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు విధులు.
మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కర్కాటకం: కుటుంబసభ్యులతో సఖ్యత. శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
సింహం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. శ్రమా«ధిక్యం.
కన్య: బంధువులతో కొన్ని వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఇంటాబయటా చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం
తుల: పనులు విజయవంతంగా సాగుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సంఘంలో విశేష పేరుప్రతిష్ఠలు. బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
వృశ్చికం: పనులు దిగ్విజయంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
ధనుస్సు: ముఖ్య నిర్ణయాలలో నిదానం అవసరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విరో«ధాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చిక్కులు.
కుంభం: కొత్త మిత్రులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగులకు హోదాలు.
మీనం: బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.


