గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: బ.తదియ సా.6.43 వరకు తదుపరి చవితి, నక్షత్రం: పూర్వాషాఢ రా.10.56 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ఉ.7.05 నుండి 8.51 వరకు, దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.23 వరకు, అమృత ఘడియలు: సా.5.40 నుండి 7.25 వరకు.
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... పనులు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటిలో వివాదాలు. ఖర్చులు అధికమవుతాయి. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. దేవాలయ దర్శనాలు.
వృషభం.... ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్య, కుటుంబసమస్యలు. భూవివాదాలు. అనుకోని ఖర్చులు. కొన్ని బాధ్యతలు మీదపడొచ్చు. వ్యాపారులకు తొందరపాటు తగదు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
మిథునం.... ముఖ్యమైన పనులు అనుకున్న రీతిలో పూర్తి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాల్లో నూతన అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కర్కాటకం......ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.
సింహం.......కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాబడి తగ్గుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు.
కన్య...... పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాల్లో మార్పులు. రాబడి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రమపడాలి.
తుల......కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఆలయ దర్శనాలు. కీలక నిర్ణయాలు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి..
వృశ్చికం... బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. శ్రమాధిక్యం. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు... ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు.
మకరం... కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. ఇతరుల నుంచి విమర్శలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం.... పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం.
మీనం..... ఉద్యోగ ప్రయత్నాలు పురోగతి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు కొత్త ఆశలు.


