Horoscope Today: ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది | Today Telugu Horoscope On June 13th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది

Published Thu, Jun 13 2024 6:22 AM | Last Updated on Thu, Jun 13 2024 9:23 AM

Horoscope Today: Rasi Phalalu On 13-06-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి రా.8.51 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: పుబ్బ తె.4.46 వరకు(తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఉత్తర, వర్జ్యం: ఉ.11.21 నుండి 1.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.41 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: రా.9.54 నుండి 11.40 వరకు. 

మేషం: శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచన లు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కళాకారులకు సన్మానాలు.

వృషభం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలలో మార్పులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమపడాలి.

మిథునం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో ఆదరణ. అరుదైన సన్మానాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు. విందువినోదాలు.

కర్కాటకం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా చికాకులు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. బంధువులతో అకారణంగా తగాదాలు.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. విద్య, ఉద్యోగావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. విందువినోదాలు.

కన్య: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ధన వ్యయం. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి..

తుల: పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చికం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన విద్యావకాశాలు.

ధనుస్సు: అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా లేనిపోని సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాల కోసం యత్నాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం.

కుంభం: కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. కొత్త విషయాలు తెలుస్తాయి. దైవచింతన.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement