ఒంటరి బతుకుకు జగనన్న అండ  | Sakshi
Sakshi News home page

ఒంటరి బతుకుకు జగనన్న అండ 

Published Mon, Feb 26 2024 6:18 AM

Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

ఒంటరి బతుకుకు జగనన్న అండ 
ఐదేళ్ల క్రితం మా ఆయన ఈరోతు యుధిష్టరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటికే ఇద్దరు పిల్లలున్న మా కుటుంబం కష్టాల్లో పడింది. ఎలా బతకాలో తెలియక సతమతమయ్యాను. అప్పటికే నాకు టైలరింగ్‌ రావడంతో పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం సొలికిరి గ్రామంలో దుకాణం పెట్టుకున్నాను. దానిపై కాస్తో కూస్తో ఆదాయం వచ్చేది. కానీ అది భరోసానివ్వలేదు. గత చంద్రబాబు పాలనలో పింఛన్‌ కోసం ఎన్నోమార్లు దరఖాస్తు చేసుకున్నాను. జన్మభూమి కమిటీలు నాకు పింఛన్‌ రాకుండా అడ్డుకున్నాయి. ఇంతలో దేవుడిలా జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు.

నా కుటుంబాన్ని ఆదుకున్నారు. నాకు వితంతు పింఛన్‌ వచ్చింది. టైలరింగ్‌ షాప్‌ నడుపుతున్న నాకు జగనన్న చేదోడు పధకం ద్వారా ఏడాదికి రూ. 10వేల వంతున మూడేళ్ళుగా అందుకొంటున్నాను. ఆ మొత్తంతో నా టైలరింగ్‌ షాప్‌ను, ప్యాన్సీ షాప్‌గా మార్చుకున్నాను. నా ఇద్దరు పిల్లలను ఎంపీపీ స్కూల్‌లో చదివిస్తున్నాను. అందులో ఒకరి పేరున అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు నా ఖాతాలో జమవుతున్నాయి. పిల్లల చదువుకు బెంగ లేకుండా పోయింది. నా ఒంటరి బతుకుకు జగనన్న అండ దొరికింది. ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి బయట పడ్డాను. దానికి కారణమైన జగనన్నకు రుణ పడి ఉంటాను. 
    – ఈరోతు కాంచన, సొలికిరి (టంకాల మోహనరావు, విలేకరి, భామిని) 

ప్రభుత్వ సాయంతో నిలదొక్కుకున్నాం 
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. నా భర్త, నేను కూలి చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. ఆ సంపాదనతో ముగ్గురు పిల్లల పోషణ కష్టంగా మారింది. 2019 తర్వాత మా జీవితంలో వెలుగులు నిండాయి. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750లు చొప్పున, వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లకు రూ.63,012, జగనన్న తోడులో రూ.10 వేలు, సున్నా వడ్డీగా రూ.2,210, వడ్డీలేని రుణంగా రూ.50 వేలు, బ్యాంకు రుణంగా రూ.2 లక్షలు అందాయి. ఆ మొత్తంతో తిరుపతి నగరం బీటీఆర్‌ కాలనీలో చిల్లర దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాం.

దాని ద్వారా నెలకు రూ.10వేల నుంచి రూ.13 వేల వరకు ఆదాయం వస్తోంది. పిల్లలు సైతం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం మా కుటుంబం సంతోషంగా ఉంది. జగనన్న సంక్షేమ పథకాలతో ఆర్‌థికంగా నిలదొక్కుకున్నాం. మా కుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ జగనన్నే సీఎంగా రావాలి.      – బి.వనజమ్మ, తిరుపతి (పోగూరి చంద్రబాబు, విలేకరి, తిరుపతి సిటీ) 

సర్కారు సాయంతో సాఫీగా జీవనం 
మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. టాక్సీడ్రైవర్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నాం. అనుకోకుండా నాకు ప్రమాదం జరిగింది. దాంతో ఏ పనీ చేయలేకపోయాను. గత ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆసరా లభించలేదు. అప్పు చేసి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురంలో చిన్నపాటి ఎలక్ట్రికల్‌ దుకాణం పెట్టుకుని జీవనం ప్రారంభించాను. అయితే అంతంతమాత్రంగానే వ్యాపారం సాగడం వల్ల రేపటిగురించి ఎప్పుడూ భయంగానే ఉండేది. అదృష్టవశాత్తూ రాష్టంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడింది. నాకున్న ముగ్గురు కుమార్తెల చదువులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎంతోహాయిగా సాగిపోయాయి. పెద్దమ్మాయి కరీనా బీటెక్‌ పూర్తి చేసింది. రెండో అమ్మాయి షరీనా హారీ్టకల్చర్‌ మూడో ఏడాది చదువుతోంది.

మూడో అమ్మాయి విలీనా బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం వల్ల వారి చదువులకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో కాలికి రూ.50 వేల విలువైన శస్త్ర చికిత్స ఉచితంగా జరిగింది. మా అమ్మకు రెండు కుంచాల భూమి ఉండడంతో రైతు భరోసా కింద రూ.7 వేలు వస్తోంది. నా భార్య మహాలక్ష్మికి వైఎస్సార్‌ చేయూత కింద ఏడాదికి రూ.18,750 వేలు వంతున అందింది. మా అమ్మ లలితమ్మకు పింఛన్‌ అందుతోంది. సీఎం జగన్‌ పాలనలో నా కుటుంబానికి అన్ని విధాలా మేలు జరిగింది.     – నల్లి వెంకయ్యదాసు, మలికిపురం     (తోట సత్యనారాయణ, విలేకరి, మలికిపురం) 

Advertisement
Advertisement