భూసమస్యతో ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భూసమస్యతో ఆత్మహత్యాయత్నం

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

పీలేరురూరల్‌ : భూ సమస్య పరిష్కారం చేయడం లేదని ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కుమారులు తహసీల్దార్‌ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ మొరవ వడ్డిపల్లెకు చెందిన పూజారి ప్రమీల, కుమారులు మహేష్‌, సురేష్‌ తమకు చెందిన సర్వే నంబర్‌ 523/1లో 12.5 సెంట్ల భూమికి సంబంధించి హద్దులు చూపాలని ఏడు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సర్వే చేయలేదని పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన సిబ్బంది పెట్రోల్‌ లాక్కుని వారిని తప్పించారు. ఆర్‌ఐ మురగయ్య, సర్వేయర్‌ రెడ్డిశేఖర్‌, వీఆర్‌వో సిద్ధయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement