సింగిల్‌గా.. అవినీతి విండో తెరిచి! | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌గా.. అవినీతి విండో తెరిచి!

Oct 11 2026 5:30 AM | Updated on Oct 11 2026 5:30 AM

గుర్రంకొండ: గుర్రంకొండ ‘సింగిల్‌విండో’లోని అక్రమాలపై అధికారులు విచారణ జరిపారు. బంగారు రుణాల్లో ఇన్‌ఛార్జ్‌ సీఈవో అనిల్‌కుమార్‌ గోల్‌మాల్‌ చేసి రూ.50 లక్షల మేరకు అవినీతికి పాల్పడినట్లు అధికారులు విచారణలో తేల్చారు. ఈసంఘటనపై సింగిల్‌విండో ఛైర్మన్‌ ఎంఎల్‌ఎన్‌ మూర్తి స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

చిత్తూరు డీసీసీ బ్యాంకు ఏజీఎమ్‌ చంద్రకళ ఆధ్వర్యంలోని అధికారుల బృందం శనివారం గుర్రంకొండ సింగిల్‌విండో కార్యాలయానికి చేరుకొని రికార్డులు తని ఖీ చేశారు. బంగారు రుణాలు ఎంత మేరకు ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు. రికవరీ చేసిన డబ్బులు డీసీసీ బ్యాంకులో జమ చేశారా లేదా అనే అంశాలపై విచారణ చేశారు.తొలుత కార్యాలయంలో అందు బాటులో ఉన్న రిజిష్టర్లు, రికార్డులను తనిఖీ చేసి... ఇవే వివరాలను ఆ న్‌లైన్‌లోనూ పరిశీలించారు. రిజిష్టరులో ఉన్న వివరాల కు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సింగిల్‌విండోలో బంగారంపై రుణాలు తీసుకొన్న మొ త్తం 249 మంది వివరాలు, వారి బ్యాంకు అకౌంట్లపై ఫూర్తి స్థాయిలో విచారణ నిర్వహించగా చేదు నిజాలు వెలుగుచూశాయి. కాగా బంగారంపై రుణాలు పొందిన లబ్ధిదారుల జాబితాలో 90 శాతం మేరకు ఒకరిద్దరు బంగారు వ్యాపారుల అకౌంట్లు, వారి బినామీల పేర్లు ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్థానిక బంగారు నగల దుకాణాలు నిర్వహించుకొంటూ కుదువ వ్యాపారం చేసుకొంటున్న ఇద్దరు వ్యాపారులను అధికారులు విచారించారు. కాగా తమ పేర్లతో ఉన్న బంగారంపై ఇన్‌ఛార్జ్‌ సీఈవో అదనంగా డబ్బులు తీసుకొన్నట్లు తెలియడంతో బంగారు వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన చైర్మన్‌

సింగిల్‌విండో కార్యాలయంలో అవినీతిపై సింగిల్‌విండో ఛైర్మెన్‌ ఎంఎల్‌ఎన్‌ మూర్తిరావ్‌ పోలీసులకు ఫిర్యా దు చేశారు. శనివారం డీసీసీబీ ఏజీఎం చంద్రకళ, ఇతర అధికారులతో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకొన్నారు. ఎస్‌ఐ రవీంద్రబాబుకు లిఖిత ఫూర్యకంగా చైర్మన్‌ ఫిర్యాదు చేశారు. ఇన్‌ఛార్జ్‌ సీఈవో అనిల్‌కుమార్‌ రూ. 50 లక్షల బంగారు రుణాల రికవరీ నగదును వాల్మీకిపురం డీసీసీ బ్యాంకులో చెల్లించకుండా ఇదే బ్యాంకులో బంగారు వ్యాపారులు మంగరాజ్‌, రాజ్‌కిరణ్‌ల పేరుమీదున్న బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అపై సింగిల్‌విండో కార్యాలయంలో ఒక ఫేక్‌ బ్యాంక్‌ అకౌంట్‌ సృష్టించి మంగరాజ్‌, రాజ్‌కిరణ్‌ ఖాతాల్లోని రూ.50 లక్షల మొత్తాన్ని అందులోకి మళ్లించారు. ఆపై ఆనగదు మొత్తాన్ని డ్రా చేసుకొన్నట్లు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్‌ఐ తెలిపారు.

బంగారు రుణాల్లో ఇన్‌చార్జ్‌ సీఈఓ నిధుల గోల్‌మాల్‌

అధికారుల విచారణ.. రూ.50 లక్షలు స్వాహా అయినట్లు నిర్ధారణ

పోలీసులకు ఫిర్యాదు... కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement