విజిలెన్స్‌ పేరుతో డబ్బులు వసూలు | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ పేరుతో డబ్బులు వసూలు

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

రాయచోటి : రాయచోటి పట్టణంలో విజిలెన్స్‌ అధికారులమంటూ హోటళ్లు, కూల్‌డ్రింక్స్‌ షాపుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడటం కలకలం రేపింది. శనివారం సాయంత్రం రింగ్‌ రోడ్డు సమీపంలోని దుకాణాలే లక్ష్యంగా ఈ దందా సాగింది. పరిదా అనే మహిళ తనను తాను ’ఏపీ ఫుడ్‌ కమిటీ మెంబర్‌’ గా చెప్పుకుంటూ తనిఖీల పేరిట హల్‌చల్‌ చేసింది. ఆమెతో పాటు వచ్చిన మరో మహిళ, డ్రైవర్‌ కలిసి.. ప్రతి షాపు వారు రూ. 5,000 ఇవ్వాలని, లేదంటే భారీ ఫైన్లు కట్టాల్సి వస్తుందని భయపట్టే ప్రయత్నం చేశారు. దీంతో బెదిరిపోయిన కొందరు చిన్న వ్యాపారులు రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు ఇచ్చుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే డబ్బులు వసూలు చేసుకున్న ఆ ముఠా, తాము వచ్చిన అ్క40 ఒఊ9788 నంబరు గల వాహనంలో అక్కడి నుండి పరారైంది. ఇటీవల కాలంలో అధికారుల పేర్లతో ఇలాంటి వసూళ్లు ఎక్కువయ్యాయని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement