ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమి కబ్జాకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూమి కబ్జాకు యత్నం

Oct 11 2026 5:30 AM | Updated on Oct 11 2026 5:30 AM

పోరుమామిళ్ల : దసరా సెలవులను ఆసరాగా చేసుకుని పోరుమామిళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి తెగబడ్డారు. కళాశాలకు చెందిన 48.65 ఎకరాల భూమిలో, ఉత్తర దిశగా ఉన్న సుమారు 20 సెంట్ల స్థలాన్ని జెసిబితో చదును చేసి, ఇసుక తోలారు. రాత్రికి రాత్రే అక్కడ గుడి కట్టే నెపంతో పాగా వేసేందుకు పక్కా స్కెచ్‌ వేశారు. ఈ అక్రమ కబ్జా యత్నాన్ని గమనించిన ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ప్రకాష్‌రావు అధ్యాపక బృందంతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సాక్ష్యాలతో సహా సీఐ సుబ్రమణ్యానికి, రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న విద్యాసంస్థల భూములను ఆక్రమించాలని చూస్తున్న సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాల ఆస్తుల పరిరక్షణకు ప్రజలు, మీడియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement