తాళం వేసిన ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో చోరీ

Oct 10 2026 1:40 AM | Updated on Oct 10 2026 1:40 AM

● రూ.50 వేల నగదు అపహరణ

వాల్మీకిపురం: పట్టణంలోని నాయక్‌వీధి సమీపంలో ఉన్న రైల్వే గేట్‌ వద్ద గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి నగదు, వెండి వస్తువులను అపహరించుకెళ్లారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయక్‌వీధి రైల్వేగేట్‌ వద్ద అనసూయమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. గురువారం మండలంలోని గంగాదొడ్డి గ్రామంలో డ్వాక్రా సమావేశం ఉండడంతో ఆమె అక్కడికి వెళ్లింది పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో గంగాదొడ్డిలోనే నిద్రపోయింది. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు అర్ధరాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. శుక్రవారం ఉదయం అనసూయమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలోని దుస్తులు, చీరలు చిందరబందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచి ఉంచిన రూ. 50,000 నగదుతో పాటు ముక్కుపుల్లలు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఆమె గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తిప్పేస్వామి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిందరబందరగా పడి ఉన్న చీరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement