సాక్షి, మదనపల్లె: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పైనల్ చేసిన పోలింగ్ కేంద్రాల వివరాలను ఆయా మండలాల అభివృద్ధి అధికారులు ప్రకటించారు. 25 మండలాల పరిధిలో 320 ఎంపీటీసీ స్థానాలు, 25 జిల్లా పరిషత్ స్థానాలు ఉండగా వాటి పరిధిలోని పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రకటించారు. ఎంపీటీసీ స్థానం పరిధిలో ఏ ఓటు నుంచి ప్రారంభమై, ఏ ఓటు వరకు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంటుందో వివరించారు. మంగళవారం తొలి జాబితా ప్రకటించి అధికారులు, దీనిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఫైనల్ ప్రకటన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 4,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటి పరిధిలో పురుష ఓటర్లు 4,46,693 మంది, మహిళ ఓటర్లు 4,62,830 మంది ఉన్నారు.


