మదనపల్లె సిటీ: జిల్లా స్థాయి టెన్నికాయిట్ జట్ల ఎంపిక ఈనెల 21వతేదీన జరుగుతుందని టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చిన్నప్ప తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సీనియర్ బాలురు,బాలికల జటుల ఎంపిక జరుగుతుందన్నారు. 8,9, 10, ఇంటర్ విద్యార్థులు అర్హులన్నారు. ఎంపికకు వచ్చే విద్యార్థులు వయస్సు నిర్థారణ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఎంపికై న వారు అక్టోబర్ 11 నుంచి 13వతేదీ వరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 77802 50922 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
రాష్ట స్థాయి 5–కె రన్‌కు ఎంపిక
మదనపల్లె సిటీ: 5–కె రెడ్ రన్ మారథాన్‌లో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు మదనపల్లెకు చెందిన విద్యార్థులు ఎంపియ్యారు. ఎయిడ్స్ నియంత్ర మండలి నిర్వహించిన 5 –కె రెడ్ రన్ మారథాన్‌లో బాలికల విభాగంలో స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థిని మహేశ్వరి ప్రథమ స్థానం, పీలేరు సంజయ్‌గాఽందీ డిగ్రీ కాలేజీ విద్యార్థిని పూజ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. బాలుర విభాగంలో మదనపల్లెకు చెందిన డిగ్రీ కాలేజీ విద్యార్థి ధనప్రసాద్ ప్రథమ, సతీష్ ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరు ఈనెల 29వతేదీ విజయవాడలో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు ఎయిడ్స్ నియంత్రణ మండలి జిల్లా అధికారి డాక్టర్ ఎల్.రాధిక, సీపీఎం భాస్కర్ వేంపల్లి తెలిపారు.
ఉత్తమ ఫలితాలు
సాధించేలా బోధించాలి
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): కేజీబీవి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ పేర్కొన్నారు. శనివారం ముష్టూరు పరిధిలోని కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. తరగతి గదులు, భోజనశాలను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందుతోందా అని విద్యార్థులను అడిగితెలుసుకున్నారు. అనంతరం అనురాధ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో బోధన చేపట్టాలని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంవో నాదీర్ఘా, ప్రిన్సిపాల్ అనిత తదితరులు పాల్గొన్నారు.


