అంతర్‌పంటసాగుతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

అంతర్‌పంటసాగుతో అధిక దిగుబడి

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

కలకడ : సాగు భూమిలో పంటమార్పిడి, వేరుశనగ పంటలో అంతర్‌పంటల సాగుతో ప్రతి రైతు అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని కె.బాటవారిపల్లె పంచాయతీలో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఎల్‌నినో పరిస్థితికి ముందస్తు సన్నద్ధత, నివారణ చర్యలు తెలియజేశారు. సకాలంలో వేరుశనగ విత్తనాలు విత్తుకోలేని రైతులు ఆముదాలు, కందిపంట, ఉలవ సాగుపై దృష్టి పెట్టిలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయశాఖ అధికారి వెంకటమోహన్‌, మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసన్‌, రైతు సేవాకేంద్రం సిబ్బంది ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement