పాలకుల రంగుల ప్రకటనల వెనుక కన్నీటి నిజాలు కడప వీధుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి పేదలను ధనికులను చేస్తామని గొప్పలు చెబుతున్నా.. కృష్ణా హాల్ వక్ఫ్ కాంప్లెక్స్ వద్ద బడికి వెళ్లాల్సిన వయసులో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చిన్నారులు చీకటి, మురికి కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటున్నారు. ఆ మురికిలో ప్లాస్టిక్ ముక్కలు వెతికి స్క్రాప్ దుకాణంలో వేస్తేనే వారి పూట గడుస్తుంది. రేపటి పౌరుల భవిష్యత్తు ఇలా వీధులపాలవుతుంటే.. పాలకుల ప్రచారాల సంబరాలు ఎవరి కోసం అని, స్వర్ణాంధ్ర సారథులు వీరేనా అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప.


