ఎస్‌ఐఆర్‌పై ఏమరుపాటు వద్దు | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై ఏమరుపాటు వద్దు

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

పీలేరు : ఓట్లు తొలగించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని, కావున ఎస్‌ఐఆర్‌పై ఏమరుపాటు వద్దని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో పీలేరు, కేవీపల్లె, కలికిరి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, బీఎల్‌ఏలకు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్‌ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోందన్నారు. పక్క రాష్ట్రాల్లో సర్వేలో భాగంగా భారీగా ఓట్లు తొలగించడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు టీడీపీ ప్రత్యేక యాప్‌ తయారు చేసి, వైఎస్సార్‌సీపీ వర్గానికి చెందిన ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రతి ఓటు కీలకమైందని, ఏ ఒక్క ఓటు పోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ నాయకులు, బీఎల్‌ఏలపై ఉందన్నారు. ఎస్‌ఐఆర్‌ సర్వే కార్యక్రమంలో బీఎల్‌వో సహకరించకపోతే జిల్లా కలెక్టర్‌కు గానీ, ఆర్డీవోకు గానీ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, హరీష్‌రెడ్డి, డాక్టర్‌ ఇక్బాల్‌అహ్మద్‌, నల్లారి తిమ్మారెడ్డి, శ్రీఖర్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఎంపీపీ సతీష్‌రెడ్డి, నూర్జహాన్‌, జెడ్పీటీసీ ఎ.టి.రత్నశేఖర్‌రెడ్డి, గజ్జెల శృతి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌లు దండు జగన్‌మోహన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, రమేష్‌రెడ్డి, మహితా ఆనంద్‌, నియోజకవర్గ పరిశీలకులు ఉదయ్‌కుమార్‌, బూత్‌ కమిటీల జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌, నాయకులు మాసుంరఫీ, మల్లీశ్వరి, నాగరాజమ్మ, లక్ష్మీ, అరుణ, హరిత, ఎన్‌.వి. చలపతి, గజ్జెల శీన్‌రెడ్డి, చక్రధర్‌, సి.కె.యర్రమరెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌, కాలనీ చిన్న, విజయశేఖర్‌రెడ్డి, షాకీర్‌, పి.ద్వారకనాథరెడ్డి, భువనేశ్వర్‌రెడ్డి, లోకనాథరెడ్డి, నీరజ, రాజేశ్వరి, రాజ్యలక్ష్మీ, షపూరా, బావాజి, హరి, సురేంద్రరెడ్డి, అమరనాథరెడ్డి, మునీర్‌, దావూద్‌, అబీద్‌, ఉబేదుల్లా, రియాజ్‌, షబ్బీర్‌, అనుష్క తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, బీఎల్‌ఏలు

వైఎస్సార్‌సీపీ నాయకులు, బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement